కొన్ని క్యారెక్టర్స్ నటులని స్టార్స్ గా మార్చేస్తాయి. ఆ క్యారెక్టర్ తోనే పదింతల క్రేజ్ వచ్చేస్తుంది. ఒక్క క్యారెక్టర్ కెరీర్ నే మలుపు తెప్పిస్తుంది. అలాంటి క్యారెక్టర్ సిద్దు జొన్నలగడ్డకి డిజె టిల్లుతో పడింది. కృష్ణ అండ్ ఇస్ లీలా, గుంటూరు టాకీస్ లాంటి సినిమాల్లో సిద్దు నటన చూశాం. నిజంగా సిద్దు నేచురల్ టైమింగ్ ఉన్న నటుడే. అయితే డిజే టిల్లు.. సిద్దు కెరీర్ కి పాత్ బ్రేకింగ్ సినిమా అయిపోయింది. డిజే టిల్లు క్యారెక్టర్ సిద్దుకే ఒక ఛాలెంజ్ గా మారింది. తను మాట్లాడుతున్నా లేదా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ పెడుతున్నా టిల్లునే కనిపించడం స్పష్టంగా గమనించవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో తన నుంచి ‘జాక్’ సినిమా వస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. భాస్కర్ కి ఒక సెపరేట్ మార్క్ ఉంది. తన హీరో క్యారెక్టర్జేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సిద్దు కూడా టిల్లు కనిపించకుండా జాక్ పాత్రని చేయాలి. సినిమా చుస్తున్నంత సేపు టిల్లు గుర్తురానివ్వకుండా చేయాలి. నటుడిగా సిద్దుకి ఇది పెద్ద పరిక్షే. మరి ఈ పరీక్షని ఎలా దాటుతాడో ఏప్రిల్ 10న తెలుస్తుంది.