డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సిద్దు జొన్నలగడ్డ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఓ మామూలు ‘బాయ్’ కాస్త స్టార్ బోయ్ సిద్దూ అయిపోయాడు. యూత్‌లో తనకంటూ ఓ క్రేజ్ వుంది. తన నుంచి ఇప్పుడు మరో సినిమా వస్తోంది. అదే ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. రేపే విడుదల. అయితే.. ఈ సినిమాకు కావల్సినంత బజ్ రాలేదనిపిస్తోంది. వరుసగా రెండు పెద్ద హిట్లు కొట్టిన ఓ హీరో సినిమా వస్తోందంటే ఎంతో కొంత హడావుడి కనిపిస్తుంది. దానికి తోడు.. బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఇది. కాకపోతే.. ‘జాక్’ బుకింగ్స్ చాలా నీరసంగా కనిపిస్తున్నాయి. బుక్ మై షో మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. `టిల్లు స్క్వేర్` సినిమా ముందు ఉన్న హడావుడి, ఆ సందడిలో సగం కూడా ఈ సినిమాపై లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
టీజర్, ట్రైలర్ యావరేజ్ మార్కులు తెచ్చుకొన్నాయి. పాటలు బయటకు వచ్చినా గుర్తుండిపోయేలా ఒక్కటీ లేదు. పైగా ఈ సినిమాకు నలుగురు సంగీత దర్శకులు పని చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో పాటలన్నీ బాగుంటాయి. కాకపోతే.. ఈ సినిమాలో ఆడియో మైనస్. టిల్లు, టిల్లు స్వ్కేర్ సినిమాల్లో పాటలు మంచి హిట్టు. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడానికి అవి మంత్రంలా పని చేశాయి. అలాంటి పాట ఈ ఆల్బమ్ లో మిస్స్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సిద్దునే ఒప్పుకొన్నాడు. ఆడియో ఇంకాస్త బాగుండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమా రిలీజ్‌కు ముందే ఇలా ఆడియోపై తన ఒపీనియన్ చెప్పడంలో సిద్దులోని హానెస్టీ కనిసించింది. అయితే.. అది సినిమాకు మైనస్ గా మారింది.
రేపు గురువారం. సాధారణంగా సినిమాలు శుక్రవారాలు విడుదల అవుతాయి. గురువారం ఓపెనింగ్స్కీ, శుక్రవారం ఓపెనింగ్స్ కీ తేడా ఉంటుంది. అదే ‘జాక్’లోనూ జరిగింది. సినిమా రిలీజ్ అయి, మంచి టాక్ వస్తే తప్ప జనాలు థియేటర్లకు రారేమో.