కరోనా వైరస్ నిర్మూలన కోసం తయారు చేసిన కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్ నిజమేనని ఇటీవల ఆస్ట్రాజెనెకా అంగీకరించగా… భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ తో కూడా దుష్ఫలితాలు ఉన్నాయని తాజాగా తేలింది. హిందూ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో కోవాగ్జిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనని నిర్ధారణ అయింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా నిర్మూలన కోసం తయారు చేసిన వ్యాక్సిన్ లతో దుష్ప్రభావాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో వివిధ సంస్థలు ఆయా వ్యాక్సిన్ లపై పరిశోధనలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న 635 మంది టీనేజర్లు, 291మంది పెద్దలపై ఏడాదిపాటు పరిశోధనలు నిర్వహించారు హిందూ వర్సిటీ పరిశోధకులు. వీరిలో 304మంది టీనేజర్లు, 124మంది పెద్దల్లో శ్వాసకోస సమస్యలు తలెత్తాయని, అలాగే, 2.7శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని నిర్ధారించారు. తాజాగా ఈ పరిశోదనకు సంబందించిన వివరాలు బయటకు రావడంతో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది.
హిందూ వర్సిటీ పరిశోధనలను కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేసిన భారత్ బయోటెక్ కంపెనీ కొట్టిపారేసింది. తమ వ్యాక్సిన్ సేఫ్ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గతంలో తమ వ్యాక్సిన్ వలన ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయా నివేదికలు స్పష్టం చేశాయని వెల్లడించారు.
కోవాగ్జిన్ పై హిందూవర్సిటీ రిపోర్ట్ పై భారత్ బయోటెక్ స్పందిస్తూ…వ్యాక్సిన్ ను ఎవరిపై ట్రయల్స్ చేస్తామో , అంతకుముందే వారి హెల్త్ రిపోర్ట్ చెక్ చేయాలని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నావారిపైనే ట్రయల్స్ జరపాలని , లేదంటే పలువురిలో సైడ్ ఎఫెక్ట్స్ బయటపడుతాయని పేర్కొంది.