సీఐడీ, ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలి ఎంత ఘోరంగా ఉందో అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీ అయిన సిమెన్స్ కు ఇండియా ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ ఢిల్లీలో మీడియాలో సమావేశంలో వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం రెండేళ్లుగా హరాస్ చేస్తోందని.. ఏ కారణం లేకపోయినా తప్పుడు కేసులు పెట్టుకుని వెంటాడుతోందన్నారు. ” 2021లో సీమెన్స్ ప్రాజెక్ట్ అద్భుతం అని వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా బోగస్ అంటున్నారు.
“ఒక వ్యక్తి 2018 లో చంపబడ్డాడు అని .. ఇంకొకరిపై 2023 లో నేరం మోపారు .. కానీ వారు చనిపోయాడు అని చెబుతున్న వ్యక్తికి ఏమీ కాలేదు .. ఇప్పటకీ వారి కళ్ల ముందే హ్యాపీగా వున్నాడు.. అది చూడకుండా .. హత్య ఎలా జరిగింది దానికి వాడిన ఆయుధం ఏంటి అని వెతుకుతున్నారు ! ఇంకో విచిత్రమేంటంటే 2021 లో కూడా ఆ వ్యక్తి బాగున్నాడని వీరే సర్టిఫికెట్ ఇచ్చారు .. కానీ ఇప్పుడు వచ్చి 2018 లో చనిపోయాడంటున్నారు ..కానీ అతను ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాడని తేల్చేశారు.
మీరు ఇల్లు కట్టుకుంటుంటే .. మీ ఇంటికి ఇటుకలు ఇతర సామాగ్రి తెచ్చిన లారీలు ఇన్వాయిస్ టాక్సెస్ కట్టారా అని మీరు చెక్ చేస్తారా ? ఆ లారీ వాళ్లు టాక్స్ కట్టకపోతే మీ ఇల్లు తప్పుడు ఇల్లు అవుద్దా ? అని ప్రశ్నించారు. నన్ను సిమెన్స్ నుండి తొలగించారని ఆరోపిస్తున్నారు .. ఈ విషయం సిమెన్స్ తో చెప్పించగలరా ? నేను అఫిషియల్ గా సిమెన్స్ కి రిజైన్ చేసింది 2016 లో .. కానీ సిమెన్స్ రిక్వెస్ట్ తో 2018 దాకా వర్క్ చేశానని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్న వేధింపులు తనను.. తన కుటుంబాన్ని మాత్రమే కాదు .. ఈ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ పొందిన లక్షల మందిని వేధించడమేనన్నారు. ఎందుకంటే వారు పొందిన ట్రైనింగ్ సర్టిఫికెట్స్ స్కామ్ వ్యాలీడ్ కాదు అని వారు ఇప్పుడు పని చెస్తున్న కంపెనీలు అంటే పరిస్థితేమిటని ప్రశ్నించారు.
ఏపీ యువత స్కిల్స్ బాగా పెంచుకుని .. ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారన్న మహోన్నత ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ చేపట్టారన్నారు. చంద్రబాబు విజన్ అద్భుతమని సుమన్ బోస్ ప్రశంసించారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అవినీతి జరగలేదుని.. నిరాధారమైన ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని స్పష్టం చేశారు. పది శాతమే ప్రభుత్వానికి 90 శాతం సిమెన్స్ ఎందుకు పెడుతుందన్న ప్రశ్నలపైనా సుమన్ బోస్ స్పందించారు. సీమెన్స్ 90 ళాకం ఉచితంగా ఎందుకు చేస్తుంది అనేది కార్పొరేట్ ప్రపంచంలో అందరికీ తెలుసన్నారు. సీమెన్సే కాదు, ప్రతి కంపెనీ వాళ్ళ ఉత్పత్తుల డిమాండ్ పెంచటం కోసం పెట్టుబడి పెడుతుంది. మార్కెటింగ్‌లో అదొక భాగం అని స్పష్టం చేశారు. మీ సెంటర్స్ పనితీరు అద్భుతం అని పొగిడి, లెటర్స్ కూడా ఇచ్చార ..మళ్ళా వాళ్ళే ఒక్క సెంటర్ ని కూడా విజిట్ చేయకుండా, ఎంక్వైరీ లాంచ్ చేసి బోగస్ FIR పెట్టారని మండిపడ్డారు. 2021లో ఒప్పందం పూర్తయ్యే నాటికి జగన్ సీఎంగా ఉండగా 40 స్కిల్ సెంటర్లనీ స్టాక్ రిజిస్టర్లతో సహా గవర్నమెంట్ కి అప్పగించారని స్పష్టం చేశారు.
సిమెన్స్ కు సంబంధం లేదని సుమన్ బోస్ తో ఒప్పందం చేసుకున్నారని.. ఇలా రకరకాలుగా సీఐడీ అధికారులు వాదిస్తున్నారు. చివరికి సుమన్ బోస్ వేధింపుల భరించి భరించి ఇక వల్ల కాదని బయటకు వచ్చి చెప్పారు.ఇక సీఐడీ ఎలా సమర్థించుకుంటుందో చూడాల్సి ఉంది.