టెన్త్ పేపర్లు లీక్ కాలేదు కేవలం మాల్ ప్రాక్టీస్ మాత్రమేనని .. వరంగల్ సీపీ రంగనాథ్… బండి సంజయ్ చేసిన ఆరోపణలకు .. చేసిన సవాళ్లకు ప్రతి సవాళ్లు.. సమాధానాలిచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో నొక్కి చెప్పారు. నిజానికి పేపర్ లీక్ చేశారని.. కుట్ర చేశారని అదే పనిగా ప్రచారం చేశారు. చివరికి సీపీ కూడా మాల్ ప్రాక్టీస్ కేసని చెప్పారు. అందులో ఏ వన్ గా బండి సంజయ్ ను చేర్చారు. ప్రభుత్వంపై దుష్ప్రచారానికి కుట్ర చేశారని ఆరోపించారు. ఇంత చేసినా ఆ కేసు రెండు రోజుల్లో తేలిపోయింది.
ఇప్పుడు పట్టించుకునేవారు లేరు. అసలు పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు పట్టించుకోలేదు. ఓ విద్యార్థి దగ్గర్నుంచి ఎవరు ఫోటో తీశారో బయటకు చెప్పడం లేదు. కానీ ప్రశాంత్ అనే జర్నలిస్టు దగ్గర్నుంచి బీజేపీ నేతలకు ఫార్వార్డ్ అయిందని… బండి సంజయ్కు ఆప్రశాంత్ ఫోన్ చేశారని కుట్ర కేసు పెట్టి రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు. దీనిపై ఓ పెద్ద కథను సీపీ రంగనాథ్ చెప్పారు. ఫోన్ దొరకలేదన్నారు. ఫోన్ దొరకబుచ్చుకోవడం పోలీసులు ఓ పెద్ద పనా ?. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు బండి సంజయ్ వద్దే ఫోన్ ఉంది. వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. తీసుకోవాలనుకుంటే ఎప్పుడెందుకు తీసుకోలేదు ?
ఇప్పుడు ఆ ఫోన్ దొరికే వరకూ తాను విచారణకు రానని నేరుగా బండి సంజయ్ చెప్పారు. ఆ ఫోన్ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన వారందరికీ బెయిల్స్ వచ్చాయి. వరంతా పోలీసులు రాజకీయ కుట్ర చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడీ కేసులో పోలీసలుు కూడా ఏమీ చేయకుండా సైలెంట్ అయిపోయారు. ఇంకా ముందుకు వెళ్తే మొత్తం నిజాలు వెలుగులోకి వస్తాయని ఊరుకున్నారేమో కానీ… బీజేపీ నేతలు మాత్రం దీన్ని రాజకీయంగానే చూసుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. మొదట బండి సంజయ్ ను ఢిల్లీకి పిలిపించింది. ఆయనతో మాట్లాడిన తర్వాత … గవర్నర్ కు పిలిచారు తమిళిసై ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్కారు. ఏదైనా … బీఆర్ఎస్ బండి సంజయ్ అరెస్టుతో బీజేపీని మరింత రెచ్చగొట్టిందన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.