తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పవన్ కల్యాణ్‌పై పెట్టిన కేసు.. పోలీసులను ప్రజల్లో మరంత చులకన చేస్తోంది. ఆ ఎఫ్ఐఆర్లో ప్రాథమిక వివరాలు లేవు. శివకుమార్ అనే వ్యక్తి.. ఫిర్యాదు చేశాడు కానీ.. మిగతా వివరాల్లేవు. కనీసం ఫోన్ నెంబర్ లేదు. ఐదు రోజుల తర్వాత ఎందుకు ఫిర్యాదు చేశాడో కారణం లేదు. అసలు ఆ ఫిర్యాదులో యాక్సిడెంట్ చేసినట్లుగా లేదు. తనకు తానే పడ్డానని ఉంది. ఈ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత .. మీడియా వర్గాలకూ కామెడీ అనిపించింది. కక్షతో కళ్లు మూసుకుపోయి.. ఏదో ఒకటి చేద్దామని నవ్వుల పాలవుతున్నారని వారికీ అర్థం అయింది.
పోలీసులకూ తాము చేసిన తప్పేంటో తెలిసిపోయినట్లుగా ఉంది. అటు పోలీసుల,ఇటు ఫిర్యాదు దారుడు కూడా మాట్లాడలేకపోతున్నారు. పోలీసులు ఎదైనా పెద్ద కేసు నమోదు చేసినప్పుడు మీడియాకు సమాచారం అందిస్తారు. కానీ ఈ కేసులో మాత్రం సమాచారం బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడ్డారు. ఎఫ్ఐఆర్ రెండు రోజుల తర్వాత లీక్ కావడంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీఐ శేషగిరి ఫోన్ ను స్వీచ్ ఆఫ్ చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన శివ అనే వ్యక్తి అసలు కనిపించడం లేదు తెనాలి మోరిస్ పేటలో శివ ఎవరో ఎవర తెలుసుకోలే్కపోతున్నారు.
పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు వ్యవహరం రాజకీయ కోణంలో జరిగిందని ఎవరికైనా అర్థం అవుతుంది. పోలీసులు అడ్డుకోవడం వల్లనే పవన్ తన వాహనం పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేసుకుంటూ,అలానే ఇప్పటం వరకు వెళ్ళారు. ఆ రోజే పోలీసులు రెచ్చగోట్టేలా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడ పవన్ పై ఆలస్యంగా కేసు నమోదు చేయటం,- నమోదు అయిన కేసు వివరాలను కూడా బయటపెట్టేందుకు రెండు రోజులు ఆలస్యం చేయటం వెనుక పూర్తి రాజకీయ కోణంలోనే జరిగిందని చెబుతున్నారు. ఈ కేసులో పవన్‌ను ప్రభుత్వం ఏం చేాయలనుకుంటుందో కానీ.. తనతో పాటు పోలీసుల్నీ నవ్వులపాలు చేసిందని మాత్రం కామెంట్స్ వినపిస్తున్నాయి.