సింధూరపువ్వుతో పాపులర్ అయిన కథానాయిక నిరోషా. ఆ తరవాత తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. చిరంజీవి లాంటి టాప్ స్టార్ల పక్కనా చిందేసింది. ఆ తరవాత గ్లామర్ తగ్గడం, పోటీ పెరగడంతో సినిమాలకు దూరమైంది. రామ్ కీని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిలైపోయింది. అయితే తమిళ తెరపై అప్పుడప్పుడూ దర్శనమిస్తోంది. తెలుగులో మాత్రం ఒక ఊరిలో (2005) తరవాత కనిపించలేదు. ఇంతకాలానికి మళ్లీ నిరోషా రీ ఎంట్రీ ఇస్తోంది. విశాల్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తమన్నా కథానాయిక. ఈ చిత్రంలో నిరోషాకి ఓ కీలక పాత్ర దక్కింది.
జగపతిబాబు ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. విశాల్ తెలుగులో నటించే తొలి చిత్రమిదే. అందుకే కాస్టింగ్‌లో తెలుగు, తమిళ నటీనటులు ఉండేలా జాగ్రత్తపడ్డాడు. విశాల్‌కి ఈ సినిమా మైలు రాయిగా నిలిచిపోతుందని, జగపతిబాబు – విశాల్ మధ్య నడిచేసన్నివేశాలు ఆకట్టుకొంటాయని చిత్రబృందం చెబుతోంది. సురాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.