తొంభై శాతం పైగా సినీ జీవులందరూ మీడియా ముందు మాట్లాడే మాటలన్నీ కూడా కలెక్షన్స్‌ని టార్గెట్ చేసుకునే ఉంటాయి. ఆ మాటలతోనే కొందరు క్రమ క్రమంగా ఆకాశమంత ఇమేజ్ పెంచేసుకుని అభిమానుల దృష్టిలో దేవుడైపోతారు. మరీ అంత లాంగ్ రన్లో మునిలా మాట్లాడడం, అదే ఇమేజ్‌ని మెయింటైన్ చేయడం కష్టం అనుకున్నవాళ్ళు మాత్రం ఏ సినిమాకు ఆ సినిమా అన్నట్టుగా తమకు తోచినట్టుగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడేస్తూ ఉంటారు, భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళ భజన చేస్తూ ఉంటారు. అలా చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ తమ సినిమాలు చూస్తారని భజనరాయుళ్ళ ఫీలింగ్. ‘సింగం’ సిరీస్ సినిమాలతో తెలుగునాట కూడా కలెక్షన్స్ కొల్లగొడుతున్న హరి కూడా ఇఫ్పుడు ఎన్టీఆర్ భజన చేస్తున్నాడు. ఆ మధ్య ఓ సారి ఎన్టీఆర్‌ని కలిసి తన స్టైల్లో ఉండే ఓ మాస్ కథ చెప్పాడు హరి. అయితే టెంపర్ సినిమా నుంచి కూడా మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కథలో కాస్త కొత్తదనం, అలాగే మంచి కంటెంట్ ఉన్న కథలనే ప్రిఫర్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అందుకే హరి చెప్పిన రొటీన్, రెగ్యులర్ మాస్ సబ్జెక్ట్‌ని రిజెక్ట్ చేశాడు. అఫ్కోర్స్ అలాంటి రెగ్యులర్ మాస్ సబ్జెక్స్ట్ని తీయడంలో హరి సూపర్ ఎక్స్పర్ట్ అనుకోండి. కానీ తనకు ఇప్పుడున్న ఇమేజ్‌కి ఆ కథ సరిపోతుందో…లేదో అన్న డౌట్‌తోనే ఆ సబ్జెక్ట్‌ని రిజెక్ట్ చేశాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ నో చెప్పడంతో తమిళ్‌తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ఇచ్చిన హరి ఇగో హర్టయ్యింది. తన సింగం సిరీస్ సినిమాలు హిందీలో కూడా దుమ్ము దులిపేస్తుంటే ఓ తెలుగు హీరో తన కథ బాగా లేదని చెప్పడం ఏంటి? అని ఫీలయ్యాడు. అదే విషయాన్ని తన సన్నిహితుల దగ్గర మాట్లాడేశాడు. ఎన్టీఆర్ గురించి కాస్త కోపంగానే మాట్లాడేశాడు. సోషల్ మీడియా ట్రెండ్‌లో అలాంటి విషయాలు అస్సలు దాగవు కదా. అందుకే ఆ న్యూస్ కాస్తా ఎన్టీఆర్ అభిమానులందరికీ రీచ్ అయిపోయింది. డిసెంబర్ 16న తెలుగులోనూ భారీగా రిలీజ్ అవనున్న సింగం-3 సినిమా ప్రమోషన్స్ కోసం తెలుగు మీడియా ముందుకు వచ్చిన హరి ఇప్పుడు డ్యామేజ్ కంట్రోలింగ్ చర్యలకు రెడీ అయ్యాడు. ‘ఎన్టీఆర్ నా అభిమాన నటుడు’ అని చెప్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదు అని తాను అన్నట్టుగా జరిగిన ప్రచారం గురించి కూడా అయ్యగారికి అస్సలు తెలియదట. తెలుగులో ఉన్న ఓ టాప్ రేంజ్ స్టార్ హీరో గురించి తాను అన్నట్టుగా వచ్చిన మాటలు సోషల్ మీడియాతో పాటు వెబ్‌సైట్స్, న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్‌లో కూడా చాలా చాలా పాపులర్ అయ్యాయి. కానీ హరికి మాత్రం సింగం-3 సినిమా కోసం తెలుగు మీడియాకు ఇంటర్యూలు ఇవ్వడానికి వచ్చేవరకూ ఆ విషయం తెలియలేదట. తన సినిమా కలెక్షన్స్పైన ఎక్కడ ప్రభావం చూపిస్తుందో అని ఎన్టీఆర్ అభిమానులను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడు హరి. ఎన్టీఆర్ నా అభిమాన నటుడు, భవిష్యత్‌లో కచ్చితంగా ఎన్టీఆర్‌తో సినిమా చేస్తా లాంటి రొటీన్ డైలాగులు పేల్చుతున్నాడు. అవసరమైతే ఎవ్వరి భజన అయినా చేయగల సమర్థులు కదా మరి.