పైరసీ భూతం సినీ పరిశ్రమను వెంటాడుతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పైరసీని ఆపడం సాధ్యపడటం లేదు. ఎంత అప్రమత్తంగా వుంటున్నా ఏదో మార్గంలో పైరసీ చేసుకొని డబ్బులు కూడా బెట్టుకుంటున్నారు నేరగాళ్ళు. అయితే ఇప్పుడీ పైరసీ భూతం మరింత ముదిరిపోయింది. ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా పైరసీ చేసుకొనే సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చేశారు. అపీషియల్ గా ట్విట్టర్ , పేస్ బుక్ పేజీలు నిర్వహిస్తూ పైరసీకి కూడా పబ్లిసిటీ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఇంకాస్త ముదిరింది. ఏకంగా నిర్మాతలకే వార్నింగ్ ఇచ్చే స్థాయి వచ్చారు పైరసీ నేరగాళ్ళు.
సూర్య కొత్త సినిమా ‘సింగం 3’. జ్ఞానవేల్ రాజా నిర్మాత. ఈనెల తొమ్మిదిన సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమాకి పైరసీ బెదిరింపులు వచ్చాయి. ‘సింగం 3’ని పైరసీ చేస్తామని నిర్లజ్జగా ప్రకటించింది ‘తమిళ్ రాకర్స్’ అనే పైరసీ వెబ్సైట్. సినిమాలను హేచ్డీ ప్రింట్ లతో ఆన్ లైన్ లోకి వదులుతుంటారు తమిళ్ రాకర్స్. కబాలి సినిమాని లీక్ చేసింది వీరే. ఇదే కాదు చాలా సినిమాలను పైరసీ చేసి వివిధ టోరెంట్స్ లో లోడ్ చేసి డబ్బు చేసుకుంటారు తమిళ్ రాకర్స్. ఇదంతా పబ్లిక్ గా జరుగుతున్నా ఎవరూ ఆపలేకపోతున్నా పరిస్థితి. ఇదే అంశం పై ఇటివలే జ్ఞానవేల్ రాజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘తమిళ్ రాకర్స్’ అంతు చూడాలని పిలుపు నిచ్చారు. జ్ఞానవేల్ రాజా చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన ‘తమిళ్ రాకర్స్’.. సింగం 3 విడుదలైన రోజు 11గంటలకే సినిమా ఆన్ లైన్ ఉటుంది” అంటూ సినిమాటిక్ గా ఓ వార్నింగ్ ఇచ్చేశారు.
చాలా దారుణమైన ధోరణి ఇది. పైరసీ అనేది నేరం. అలాంటి నేరాన్ని నిర్లజ్జగా చేస్తామని చెప్పి మరీ బెదిరించడాన్ని ఏమని అర్ధం చేసుకోవాలి. ఇలా బరి తెగించిన నేరగాళ్ళను వెంటనే అదుపుచేయాల్సిన భాద్యత సైబర్ అధికారులపై వుంది.