సింగం మరోసారి నిరాశ పరిచింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న సింగం.. తెలుగు ప్రేక్షకులకు మరోసారి షాక్ ఇచ్చింది. ఈరోజు విడుదల కావాల్సిన సింగం 3 తెలుగు వెర్షన్ ఇంకా విడుదల కాలేదు. మార్నింగ్ షోలన్నీ క్యాన్సిల్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్ లో మార్నింగ్ షోలు రద్దు చేశారు. సాంకేతిక కారణాల వల్ల జంట నగరాల్లో సింగం 3 విడుదల కావడం లేదని, త్వరలోనే అప్ డేట్ చెబుతామని చిత్రబృందం ప్రకటించింది. సాయింత్రానికల్లా తొలి షో పడే అవకాశం ఉంది. అయితే తమిళనాట, ఓవర్సీస్లోనూ.. సింగం 3 విడుదలైంది. అక్కడ ప్రీమియర్ షోలతోనే హడావుడి మొదలైంది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం సింగం 3 ఓ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. సూర్య ఫైటింగులు, డైలాగుల కోసమైతే సినిమా నిరభ్యంతరంగా చూసేయొచ్చని చెబుతున్నారు. ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుందో మరి.