హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ సమర్పించటానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని బృందం ఇవాళ రాజమండ్రికి చేరుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు, అధికారులు బృందానికి స్వాగతం పలికారు. విమానాశ్రయంనుంచి చంద్రబాబు, ఈశ్వరన్ ఒకేకారులో రాజమండ్రి నగరంలోని షెల్టాన్ హోటల్‌కు వెళ్ళారు. ఏపీ ప్రభుత్వం అనుమతిస్తే రాజధాని నిర్మాణంలో భాగస్వాములవుతామని మంత్రి ఈశ్వరన్ అన్నారు. చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు చెప్పారు. తర్వాత సింగపూర్ బృందంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాలలోని పూష్కరఘాట్లను ఏరియల్ సర్వే చేశారు. మధ్యాహ్నం ఇరు ప్రభుత్వాల ప్రతినిధులమధ్య చర్చలు ఉంటాయి. ఆ తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. సాయంత్రం పుష్కర హారతికికూడా బృందం హాజరుకానుంది.