రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్లో గాయకుడు. చలో, రంగస్థలం, జోష్ ,దమ్ము ,రచ్చ లాంటి ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన ఈ గాయకుడు నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి పోలీసుల వద్ద “రచ్చ” చేశాడు. ఈయనతో పాటు యాంకర్ లోబో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. వీళ్ళిద్దరూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కాస్త రచ్చ జరిగింది. అయితే ఆ వాగ్వాదానికి చెందిన వీడియోలు మీడియాలో దర్శనమివ్వడంతో ఇద్దరు పరువు పోగొట్టుకున్నారు. అయితే రాహుల్ వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడం ఇక్కడ గమనార్హం.
మరొక సంగతి ఏమిటంటే గతంలో “చలో” అనే సినిమాలో ఈ గాయకుడు ఒక పాట పాడాడు. హీరోయిన్ ని ఉద్దేశించి హీరో ,”టెక్కు లాపవే, టెక్కు లాపవే, చిక్కి నావే నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా” అనే ఆ పాట బాగా పాపులర్ అయింది కూడా అయితే ఇప్పుడు అదే పాట ఆ పాడిన గాయకుడు కి వర్తిస్తుంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన తర్వాత కూడా పోలీసుల వద్ద టెక్కు చూపించబోయి బుక్కయ్యాడు ఈ సింగర్. ఇక యాంకర్ లోబో కూడా మ్యూజిక్ ఛానల్స్ చూసేవారికి సుపరిచితులే. విచిత్రమైన డ్రెస్సింగ్ తో హైదరాబాద్ ఉర్దూ మిక్స్డ్ తెలుగు లో మాట్లాడుతూ సరదాగా వ్యాఖ్యానాలు చేసే లోబో కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో నిన్న పట్టుబడ్డాడు.
ఏదిఏమైనా సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడటం ఈ మధ్య కాస్త ఎక్కువైంది. కనీసం ఇకముందైనా సెలబ్రిటీలు కాస్త జాగ్రత్త పడతారేమో చూడాలి