ప్రముఖ గాయని సునీత కరోనా బారీన పడ్డారు. కాకపోతే.. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈలోగా ఆమె కోలుకున్నారు కూడా. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సునీత ధృవపరిచారు. “కొన్ని రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లాను. అప్పటి నుంచీ కాస్త తలనొప్పిగా అనిపించింది. ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయిస్తే.. పాజిటీవ్ అని తేలింది. అప్పటి నుంచీ హోం క్వారెంటైన్ లోనే ఉంటూ చికిత్స తీసుకున్నా. వైద్యుల్ని సంప్రదిస్తూనే ఉన్నా. ఇప్పుడు తేరుకున్నా. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా” అన్నారు. తన ఆలోచన అంతా.. బాలు ఆరోగ్యం గురించే అని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు సునీత. మరో గాయని మాళవిక కూడా కరోనా బారీన పడినట్టు వార్తలొచ్చాయి. సునీత, మాళవిక ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారని, అప్పటి నుంచే వాళ్లకు కరోనా లక్షణాలు మొదలయ్యాయని తెలుస్తోంది.