నిన్నా మొన్నటి వరకూ… డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల టార్గెట్ పూరి జగన్నాథ్ మాత్రమే! లిస్టులో చాలామంది సినీ ప్రముఖుల పేర్లు ఉన్నా… పూరినే కీలకం అని సిట్ అధికారులు భావించారు. పూరి ద్వారానే డ్రగ్స్ సరఫరా అయినట్టు సిట్ దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉండడంతో… వాళ్ల దృష్టి కేవలం పూరి పైనే ఉండేది. ఇప్పుడు టార్గెట్ ఛేంజ్ అయినట్టు…. వాళ్ల దృషి నవదీప్‌పై పడినట్టు సమాచారం. నవదీప్ తో సిట్ విచారణ పూర్తయింది. ఈ 11 గంటల విచారణలో సిట్ కి కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. కెల్విన్ నుంచి కాల్స్ ఎక్కువగా రిసీవ్ చేసుకొన్నది నవదీప్ అని, వీరిద్దరి మధ్య బలమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని పోలీసులు అనుమాన పడుతున్నారు. నవదీప్ నటుడిగానే కాక.. ఈవెంట్ మేనేజన్గానూ వ్యవహరించినట్టు సిట్ వాళ్లకు కీలక సమాచారం అందింది. దేశ, విదేశాల్లో కొన్ని ఈవెంట్లను నవదీప్ నిర్వహింఆచడని, ఆ ఈవెంట్లలో డ్రగ్స్ విచ్చల విడిగా వాడారని సిట్ అధికారులు భావిస్తున్నారు. గోవా కేంద్రంగా నడుపుతున్న డ్రగ్స్ ముఠాకూ.. కెల్విన్కీ దగ్గర సంబంధాలున్నాయని. వాళ్లతో నవదీప్కీ పరిచయాలు ఉన్నాయని.. సిట్ ప్రాధమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. అందుకే… పూరి నుంచి దృష్టి నవదీప్ వైపుకు మళ్లిందని తెలుస్తోంది.