తెలుగుదేశం పార్టీకి చెందిన లక్షల ఓట్లను తొలగించాలని.. వచ్చిన ఫాం 7 అక్రమ దరఖాస్తుల వ్యవహారంపై కూడా మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎపీ ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో సజీవంగా ఉన్న అనేకమందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేశారు. ఈ దరఖాస్తుల ద్వారా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం వద్ద 8లక్షల 76వేల ఫారం 7 దరఖాస్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు లక్షా 61వేల ఐదు దరఖాస్తులను పరిశీలన చేయగా, ఇందులో 5వేల 309మాత్రమే అసలైన దరఖాస్తులుగా పరిగణించారు. ఒక లక్షా 55వేల 696 నకిలీ దరఖాస్తులను తిరస్కరించారు.
వైసీపీ నేతల పేర్లతో వారికి తెలియకుండానే దరఖాస్తులు చేయడంతో ప్రస్తుతం వీరంతా క్రిమినల్ కేసులలో చిక్కుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దొంగ చిరునామాలతో ఆన్ లైన్ ద్వారా ఫాం 7 కింద అనేక దరఖాస్తులు చేయడంతో వీరందరి పై సుమారు 350 వరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సుమారు రెండున్నర లక్షల ఓట్లు తొలగింపుకు సంబంధించిన ఈ దరఖాస్తులను నకిలీవని తేల్చారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ కేసులు నమోదు అవుతుండటంతో వీటన్నింటినీ కలిపి విచారించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీనియర్ ఐపీయస్ అధికారి కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని నిర్ణయించారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీని టార్గెట్గా చేసి.. వేసిన ఓ వ్యూహాత్మక తప్పిదంతో.. తన క్యాడర్ మొత్తంపై.. క్రిమినల్ కేసులు పడేలా చేసుకున్నారు. ఇప్పుడు వారంతా.. పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. తమ పార్టీ అధినేతే.. తమపై క్రిమినల్ కేసులు బనాయించేలా చేయడంతో.. వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఎక్కువ మంది వైసీపీ నేతలకు.. వారి పేరుతో.. దరఖాస్తులు చేసినట్లే తెలియకపోవడం ఇందులో అసలు ట్విస్ట్.