ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం “సిట్” టీడీపీని టార్గెట్ చేసి ఏర్పాటు చేశారన్నదానిపై.. చాలా మందికి ఎలాంటి డౌట్లు లేవు. కానీ అంతకు మించిన ప్రయోజనాలు సిట్లోఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం అధికార యంత్రాగానికి ఈ సిట్ ఓ వార్నింగ్ బెల్గా మారబోతోందనే అభిప్రాయం అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది. దానికి కారణం… ఈ సిట్ ఎలాంటి చర్యలు తీసకున్నా.. ముందుగా ఆ ఎఫెక్ట్ పడేది.. అధికారులపైనే. ఎందుకంటే.. ప్రభుత్వం రాజకీయ నిర్ణయాలు తీసుకున్నా.. దాన్ని అమలు చేసేది అధికారులే. తీసుకున్న నిర్ణయం నిబంధనల ప్రకారం లేదని తెలిస్తే.. ముందుగా.. సంతకం పెట్టిన అధికారి బాధ్యుడవుతాడు.
అందుకే ప్రభుత్వం నియమించిన సిట్ విషయంలో… అధికారవర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో కీలక విధులు నిర్వహించిన అధికారులను సిట్ ప్రత్యేకంగా విచారిస్తుందా.. లేక.. ప్రభుత్వ పరమైన నిర్ణయాలన్నింటిపై సంతకాలు చేసిన వారిని ప్రశ్నిస్తుందా.. అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈఎస్ఐ స్కాం అంటూ.. విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా .. పోలీస్ స్టేషన్ హోదా ఉన్న సిట్ … కేసులు నమోదు చేసి..విచారణ చేయడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ముందుగా… అప్పట్లో మంత్రిగా ఉన్న అచ్చెన్న కన్నా ముందుగా సంబంధిత అధికారులే బాధ్యులవుతారు. అచ్చెన్న … ఫలానా సేవలు పొందాలని లేఖరాశారు కానీ.. ఫలానా కంపెనీకి ఇవ్వమని లేఖలు రాయలేదు. దానికి సంబంధించిన వివరాలు ఆయన బయట పెట్టారు. ఈఎస్ఐ స్కాంలో అవినీతి ఆధారాలు ఏమైనా దొరికితే.. ముందు.. ఆ శాఖ చూసిన అధికారులు టార్గెట్ అవుతారు.
ఒక్క సిట్ వ్యవహారంలోనే.. ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి బయటపడిందంటే.. ఖచ్చితంగా అధికారుల ప్రమేయం ఉంటుంది. గతంలో… జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో… అనేక మంది ఐఏఎస్ అధికారులు సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరందరూ.. నిబంధనలకు విరుద్ధంగా… వ్యవహరించారన్న కారణంగానే… వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు సిట్ కూడా.. అలాగే అధికారులపై కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంది. అదే.. ఇప్పుడు.. అధికారవర్గాలను.. స్టిఫ్గా సిట్ చేయిస్తోంది.