తేజ సినిమాల్లో కథానాయికల పాత్రలకు చాలా స్కోప్ ఉంటుంది. కథంతా స్త్రీ పాత్రలవైపు తిప్పుతూనే హీరోయిజం చూపించగలడంలో దిట్ట తేజ. మరోసారి అలాంటి ఫార్మెట్‌లోనే ఓ సినిమా తీశాడు. అదే.. ‘సీత’. పేరు పాతదే అయినా, ఆ క్యారెక్టర్లో ట్రెండీ నెస్ ఉంది. డబ్బు కోసం ఏమైనా చేసే క్యారెక్టర్సీతది. బంధాలకు అస్సలు విలువ ఇవ్వదు. ‘నా పేరు సీత… నేను గీసిందే గీత’ అంటూ అందరినీ తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఓ వైపు రాముడంత మంచోడు. మరోవైపు రావణుడంత చెడ్డోడు. ఈ ముగ్గురి ప్రయాణమే సీత. తేజ సినిమాల్లో ఏమేం ఉంటాయనుకుంటామో… అవన్నీ ట్రైలర్లో కనిపించాయి. డైలాగులూ బాగానే పేలాయి. సీతని అనుభవించాలనుకునే సోనూసూద్, సీతని కాపాడాలనుకునే బెల్లంకొండ – ఈ ముగ్గురి ప్రయాణం సీత కథ. మరి డబ్బే లోకం అనుకునే సీత మారాందా? సీతే ప్రాణం అనుకునే రాముడు సీత కోసం ఏం చేశాడో తెరపైనే చూడాలి. ఈనెల 24న ఈ సినిమా విడుదల అవుతోంది. `నేనే రాజు నేనే మంత్రి`తో హిట్టు కొట్టిన తేజ… ఆ ఫామ్‌ని కొనసాగిస్తాడో లేదో చూడాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.