మహేష్ గారాల పుత్రిక సితార ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తను ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో పాపులర్. తన ఇన్‌స్టాలో దాదాపు పది లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. సితార డాన్సింగ్ వీడియోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తను తొలిసారి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించింది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌పై ఈ ప్రకటనని ప్రదర్శించడం విశేషం. తొలి యాడ్‌తోనే ఇంటర్నేషనల్ బ్రాండింగ్ సంపాదించేంత స్థాయికి ఎదిగిపోయింది సితార. అన్నట్టు సితార పారితోషికం ఎంత అనుకొంటున్నారు..? అక్షరాలా.. కోటి రూపాయలు.
ఓ సెలబ్రెటీ వారసురాలుగా సితార అందుకొన్న తొలి పారితోషికం ఇది. బహుశా మహేష్ తొలి సినిమాకి సైతం ఇంత పారితోషికం తీసుకొని ఉండడు. నిజానికి సితారకు ఇప్పుడే కాదు.. ఇది వరకు చాలా ఆఫర్లు వచ్చాయి. కోరినంత పారితోషికం ఇస్తామని, కమర్షియల్స్‌లో చేయమని అడిగారు. కానీ.. మహేష్ ఒప్పుకోలేదు. ఈసారి మాత్రం ఎందుకో టెమ్ట్ అయ్యాడు. దానికి తగ్గట్టే… ప్రతిష్టాత్మక టైమ్ స్వ్కేర్‌పై సితార మెరిసింది. ఈ మూమెంట్స్‌ని సితారతో పాటు మహేష్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే ”నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. టైమ్స్ స్వ్కేర్నే వెలిగిస్తున్నావు. ఇలానే కొనసాగించు” అంటూ తన ఆనందాన్ని పంచుకొంటూ ట్వీట్ చేశాడు మహేష్.