‘భ్రమయుగం’.. కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికల్లో ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో మలయాళంలో విడుదలైన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ని పంచే సినిమాని మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా మలయాళం వెర్షన్ హైదరాబాద్ లోని కొన్ని మల్టిఫ్లెక్స్ లో బాగానే ఆడుతోంది. నిజానికి ఈ సినిమాని తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల చేయాల్సింది కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా తెలుగు హక్కులు సొంతం చేసుకుంది. ఈ నెల 23న విడుదల చేస్తుంది. ఈ వారంలో దాదాపు అన్నీ చిన్న సినిమాలే వున్నాయి. ఇప్పటికే మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా కూడా తోడైయింది. సితార లాంటి సంస్థ విడుదల చేయడంతో ‘భ్రమయుగం’పై తప్పకుండా ప్రేక్షకుల ద్రుష్టి పడే అవకాశం వుంది. పైగా సినిమాపై పాజిటివ్ టాక్. అయితే మలయాళంలో హిట్ కొట్టిన చాలా సినిమాలు ఇక్కడి ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి. మరి ‘భ్రమయుగం’ భవిష్యత్ ఎలా వుంటుందో చూడాలి.