చిన్న వీడియోతో వైరల్ అయిపోయింది ప్రియా వారియర్. చిలిపిగా కన్నుకొట్టి – కోట్ల హృదయాల్ని కొల్లగొట్టింది. కొన్ని సెకన్ల వీడియోతో ప్రియా వారియర్ పాపులర్ అయిపోయింది. ఆమె ఖ్యాతి ఎంత వరకూ వెళ్లిపోయిందంటే – అప్పటికే ఇండ్రస్ట్రీలో కుదురుకున్న టాప్ హీరోయిన్లకు సైతం కుదురు లేకుండా చేసింది. టాలీవుడ్ నుంచి కూడా ప్రియావారియర్‌కు ఆఫర్లు వెళ్లాయి. తను నటించిన సినిమాని `లవర్స్ డే` పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నప్పుడు ఆ సినిమా ప్రచార భారమంతా ప్రియా వారియరే మోసింది. ఈ ఫంక్షన్‌కి అల్లు అర్జున్ కూడా వెళ్లాడు. ప్రియా గ్లామర్‌కి, అల్లరికి ఫిదా అయిపోయాడు. టాలీవుడ్లో ప్రియావారియర్‌కి వరుసగా అవకాశాలు ఖాయం అని లెక్కలు వేసేశారు సినీ మేధావులు. కొంతమంది అగ్ర కథానాయకుల చిత్రాలకు ఆమె పేరుని పరిశీలించడం కూడా వాస్తవం.
అయితే ప్రియా వారియర్ ఆశలకు గండి కొడుతూ `లవర్స్ డే` విడుదలైంది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడమే కాదు.. ప్రియా వారియర్ కెరీర్‌కీ మైనస్ అయిపోయింది. ప్రియా స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చాలా చాలా ఊహించుకుని అడుగుపెట్టిన కుర్ర ప్రేమికులకు కూడా `లవర్స్ డే` హ్యాండిచ్చింది. ఈ సినిమా సరిగా ఆడకపోయినా – ప్రియా నటనకు, ఆమె గ్లామర్‌కూ మార్కులు పడితే – వారియర్ కెరీర్ కి ఎలాంటి ఢోకా ఉండేది కాదు. కానీ.. ఆ విషయంలోనూ నిరాశే ఎదురైంది. ఈ సినిమా విడుదల అవ్వకపోయుంటే బాగుండేదేమో – అని ప్రియా వారియర్ కూడా ఇప్పుడు ఫీలవుతుందోట. ఇది వరకు ప్రియా వారియర్‌ని హీరోయిన్గా ఎంచుకుందామని సంప్రదించినప్పుడు `పెద్ద హీరో ఉంటేనే చేస్తా.. `అంటూ షరతులు విధించేది. ఇప్పుడు ప్రియాకి ఆ అవకాశం లేదేమో అనిపిస్తోంది. అతి తొందర్లో ప్రియాకి ఓ పెద్ద హీరో నుంచో, ఓ పెద్ద సంస్థ నుంచో ఆఫర్ వెళ్తే ఫర్వాలేదు. లేదంటే కొత్త హీరోలతో సైతం ప్రియా ఎడ్జస్ట్ కావాల్సిందే.