ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఓ స్థాయి నేతలు కూడా.. కేసుల బారిన పడి… ఆజ్ఞాతంలోకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరో వైపు గ్రామాల్లో… దాడులు… క్యాడర్ను చెల్లాచెదురు చేసే పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అధినేత… క్యాడర్ కు అండగా ఉండాలని.. గ్రామాల్లో పర్యటించాలని.. టీడీపీ నేతలను ఎంతగా ఒత్తిడి చేస్తున్నా… తమ పరిస్థితే దారుణంగా ఉందని… వారు పట్టించుకోవడం మానేశారు. పల్నాడులో… జననేతలని చెప్పుకున్న వారు… తమను తాము రక్షించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో… టీడీపీ నేత అధినేత నేరుగా రంగంలోకి దిగి.. క్యాడర్ కు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
గుంటూరులో దాడులకు గురై.. ఊళ్లు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిన టీడీపీ కార్యకర్తల కోసం.. ఓ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరుపైనే తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు శిబిరానికి వచ్చి మాట్లాడి బాధితులను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేస్తే జైళ్లలో ఉంటాం కానీ… పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించకుంటే పోలీసుల్ని బాధ్యుల్ని చేస్తూ ప్రైవేటు కేసులు వేస్తామని హెచ్చరించారు. వైఎస్ కంటే దారుణంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలన్న చంద్రబాబు… బాధితులను వెంటతీసుకుని తానే ఊరులోకి వెళ్తానని చెప్పారు. ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని సవాల్ విసిరారు. తమ పార్టీ తిరుగుబాటు చేస్తే జైళ్లు సరిపోవని హెచ్చరించారు. బాధితుల ఊళ్లలో తానే ఉంటానని… తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.
ఇప్పటివరకు ఏడుగురిని హత్య చేశారన్న చంద్రబాబు… 22 మందిపై భౌతిక దాడులు చేశారని గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 మంది తెదేపా మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారన్న చంద్రబాబు… రోడ్డుపై గోడ కట్టిన ఘటన ఎప్పుడన్నా చూశామా.. అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి… కానీ అధికారులు శాశ్వతమన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. గ్రామాల్లో మళ్లీ సాధారణస్థితి వచ్చేవరకు పోరాడతామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వైసీపీ దాడులతో వలస వెళ్లిపోయిన..ఒక్కో కుటుంబానికి రూ.10 వేల తక్షణ సాయం అందిస్తున్నరాు. తప్పుడు కేసుల్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నరు. మంచి న్యాయవాదుల్ని పెట్టి బాధితులపై భారంపడకుండా చూస్తామని కార్యకర్తల్లో ధైర్యం నింపారు.