ఈరోజు రిపబ్లిక్ డే. సెలవుదినం. కొత్త సినిమాలకు మంచి ఛాన్స్. అందుకే రెండు డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీసు ముందు క్యూ కట్టాయి. అందులో కెప్టెన్ మిల్లర్ ఒకటి. మరోటి.. శివకార్తికేయన్ నటించిన అయలాన్. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తయారైన ఈ సినిమా గతవారంలోనే తమిళనాట విడుదలైంది. ఈరోజు.. టాలీవుడ్ లోకి అడుగుపెట్టాలి. అయితే.. అనివార్య కారణాలతో అయలాన్ షోస్ అన్నీ రద్దవుతున్నాయి. ఉదయం 10 గంటల ఆటలకు టికెట్లు అమ్మిన తరవాత థియేటర్ యాజమాన్యం `సారీ` చెప్పి, డబ్బులు వాపస్ చేసింది. మార్నింగ్ షో, మాట్నీ ఆటలూ రద్దవుతున్నాయి. శివకార్తికేయన్ సినిమా ఆర్థిక సమస్యలతో విడుదలకు బ్రేక్ పడిందని, అందుకే షోలు రద్దువుతున్నాయని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సమస్యని క్లియర్ చేసుకొని, రిలీజ్ కి క్లియరెన్స్ తెచ్చుకోవాలని తెలుగు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రిపబ్లిక్ డే సెలవుని క్యాష్ చేసుకోవాలన్న అలయాన్ ప్రయత్నం బెడసికొట్టింది. ఇదే రోజు విడుదల అవుతున్న కెప్టెన్ మిల్లర్‌కు ఇది ప్లస్ కానుంది. ధనుష్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. పోటీకి రావాల్సిన సినిమా ఆగిపోయింది. దాంతో ధనుష్ సినిమానే ఏకైక ఆప్షన్ గా మిగిలింది.