వరుణ్ డాక్టర్ సినిమా శివకార్తికేయన్ కు కొత్త జోష్ ఇచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు కూడా చక్కగా ఆదరించారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూసిన శివకార్తికేయన్ తెలుగుపై ప్రత్యేక ద్రుష్టి సారించారు. ప్రతి సినిమాకి తెలుగులో ఎక్కువ ప్రమోషన్స్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. నేరుగా తెలుగు దర్శకుడు అనుదీప్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అంతేకాదు .. ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలతో అన్నిహితంగా వుంటున్నారు. తెలుగు సినీ ప్రముఖల పెళ్ళిళ్ళు, వేడుకలు ప్రత్యేకంగా హాజరౌతున్నారు.
తనవంతుగా ఇక్కడ సినిమాలని తమిళ్ లో ప్రమోట్ చేస్తున్నారు. అఖిల్ ఏజెంట్ టీజర్ తమిళ్ లో రిలీజ్ చేసింది శివకార్తికేయన్ నే. శివకార్తికేయన్ కొత్త సినిమా ‘మహావీరుడు’ టైటిల్ పెట్టనప్పటి నుండే తెలుగు పాజిటివ్ ప్రమోషన్స్ తీసుకురావడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు తో టైటిల్ టీజర్ రిలీజ్ చేయించారు. ఈ మధ్య వచ్చిన శివకార్తికేయన్ ‘కాలేజ్ డాన్’ సినిమా కూడా తెలుగు యూత్ కి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడా కనెక్షన్ ని ఇంకా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు శివకార్తికేయన్. అనుదీప్ తో చేస్తున్న ప్రిన్స్ సినిమా నేరుగా తెలుగులో విదుదలౌతుంది. ఇది గనుక మంచి విజయాన్ని సాధిస్తే తెలుగులో కూడా శివకార్తికేయన్ కు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడుతుందనే చెప్పాలి.