అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్ ప్రమాదంలో ఆరుగురు తూర్పుగోదావరి జిల్లా వాసులు చనిపోయారు. జాన్సన్ కౌంటి క్లూబర్న్ హైవే నెంబర్ 67లో ఈ ప్రమాదం జరిగింది. మార్కెట్ టు హైవే రోడ్ లో అతి వేగంగా వస్తున్న ట్రక్ తూ.గో జిల్లా వాసులు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. ఘటన గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు వచ్చి.. ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రమాద తీవ్ర ఎక్కువగా ఉండటంతో.. ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని తెలుస్తోంది.
ప్రమాదంలో కారు మృతి చెందిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మృతుల వివరాలను ఇంకా పూర్తి స్థాయిలో అధికారికంగా వెల్లడించలేదు. టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ డిపార్టుమెంట్ మొత్తం ఆరుగురు చనిపోయారని నిర్దారించింది. తప్పు ఎదురుగా వస్తున్న ట్రక్ దా.. తూ.గో వాసులు ప్రయాణిస్తున్న కారుదా అన్నదానిపై ఇంకా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రమదంలో చనిపోయిన వారంతా తెలుగు వారని తెలియడంతో.. తెలుగు సంఘాలు వెంటనే… అధికారవర్గాల్ని సంప్రదించాయి. వారికి కావాల్సి నసమాచారన్ని అందించడంతో పాటు.. ఇండియాలోని వారి కుటుంబీలకు తెలిసేలా ఏర్పాట్లు చేశారు. మృతదేహాల్ని ఇండియాకు పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చనిపోయిన వారంతా మంచి భవిష్యత్ ఉన్న యువకులు కావడంతో తెలుగు కమ్యూనిటీలో విషాదం నెలకొంది.