మాన్సాస్ చైర్మన్ పదవిని న్యాయపోరాటం చేసి మళ్లీ అశోక్ గజపతిరాజు దక్కించుకోవడంతో ప్రభుత్వ పెద్దలు పగతో రగిలిపోతున్నట్లుగా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా అశోక్‌గజపతిరాజుపై తీవ్ర విమర్శలు చేస్తూ.. జైలుకు పంపుతామని హెచ్చరికలుజారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర సీఎంగా చెలామణి అవుతున్న విజయసాయిరెడ్డి మరింత దూకుడుగా ఉన్నారు. ఆయన ఇంతకు ముందు హెచ్చరించినట్లుగానే … మాన్సాస్‌పై విచారణ ప్రారంభించారు. ప్రభుత్వం ఏకంగా ఆరు విచారణ కమిటీలను నియమించింది. ఈ ఆరు కమిటీలు… మాన్సాస్లోని వివిధ కార్యకలాపాలను విడివిడిగా పరిశీలన చేస్తాయి.
ఏ చిన్న తప్పు జరిగినట్లుగా తేలిన నమోదు చేసుకుని ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. ఉన్న పళంగా ఆరు కమిటీలు రంగంలోకి దిగాలని ఆదేశాలు అందాయి. ఆ ప్రకారం… కొన్ని కమిటీలు ఇప్పటికే తమకు అప్పగించిన విభాగాల్లో… పరిశీలనలు కూడా ప్రారంభించారు. ఒక వేళ ఎలాంటి లోపాలు లేకపోయినప్పటికీ.. సాధారణంగా తీసుకున్న నిర్ణయాలను కూడా స్కాంగా చెప్పి కేసులు పెట్టగల చాతుర్యం ప్రస్తుతం ప్రభుత్వానికి ఉంది. టీడీపీ నతేలపై ఇప్పటికే ఇలాంటి ఎన్నో కేసులు పెట్టి ఉన్నారు.
అశోక్ గజపతిరాజును ఎలాగైనా జైలుకు పంపాలన్న లక్ష్యంతో ఉన్నారు కాబట్టి.. ఆయనపైనా అలాంటి కేసు పెట్టి వారాంతాల్లో అరెస్ట్ చేసి.. రెండు, మూడు వారాల పాటు బెయిల్ రాకుండా… చేయగల సత్తా పోలీసులకు ఉందని.. అచ్చెన్నాయుడు. ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర వంటి వారి కేసుల్లోనే వెల్లడయింది. ఇప్పుడు మాన్సాస్‌లో విచారణ కమిటీల లక్ష్యం కూడా అదే అంటున్నారు. అయితే్.. అశోక్‌గజపతిరాజుపై విమర్శలకే కొన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అయితే ప్రభుత్వ పెద్దలు వీటిని పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే… ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చని అంటున్నారు.