ప్రతినాయకుడి పాత్ర విషయంలో దర్శకులు ఇప్పుడు కొత్తదనం కోరుకొంటున్నారు. కొత్తదనం పేరుతో భాష, నటనరాని నటుల్ని ముంబై నుంచి వెదికి పట్టుకొచ్చి.. వాళ్లతో తిప్పలు పడే పద్ధతికి రాం రాం చెప్పేశారు. జగపతిబాబు, ఆది పినిశెట్టి, నందమూరి తారకరత్న వీళ్లందరినీ విలన్లుగా చూస్తున్నామంటే దర్శకుల్లో వచ్చిన మార్పే కారణం. ఇప్పుడు మురుగదాస్ కూడా తన సినిమా విలన్ విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు. మహేష్ బాబుతో త్వరలో పట్టాలెక్కబోయే సినిమాలో.. ఓ కొత్త విలన్ని పరిచయం చేయబోతున్నారు. ఆ విలన్ ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య.
ఖుషీలాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్‌తో ఎస్.జె సూర్య పేరు టాలీవుడ్లో మార్మోగిపోయింది. సూర్యలో మంచి నటుడు కూడా ఉన్నాడు.కొన్ని తమిళ చిత్రాల్లో నటించాడు. అవి తెలుగులోనూ విడుదలయ్యాయి. తన సినిమాలో విలన్ పాత్రకు సూర్య అయితే సరిపోతాడని మురుగదాస్ నమ్మకం. సూర్య గెటప్ కూడా ఈ సినిమాలో వైవిధ్యంగా ఉండబోతోందట. సూర్య పేరు చెప్పగానే మహేష్ కూడా మరో మాట చెప్పకుండా.. అంగీకరించాడట. సూర్యతో మహేష్ నాని అనే సినిమా చేశాడు. ఆసినిమా ఫ్లాప్ అయినా అందులో పాయింట్కొత్తగానే ఉంటుంది. ఆ సినిమా తరవాత కూడా మహేష్, సూర్యల మధ్య రాపో కొనసాగుతోంది. అందుకే.. సూర్య విలన్ అనగానే మహేష్.. ఒప్పేసుకొన్నాడటని టాక్. సో.. తెలుగు చిత్రసీమలోమరో కొత్త విలన్ ని చూస్తామన్నమాట.