మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టుల కన్నా ముందు ప్రజలు నిజ నిర్దారణ చేసుకునేలా అన్ని వివరాలు ప్రజల ముందు పెడుతున్నాయి మీడియా. సీఐడీ చేస్తున్న ఆరోపణలు… , సజ్జల చేస్తున్న ప్రకటనలు.. సీఐడీ రిమాండ్ రిపోర్టు ఇలా ప్రతి అంశంలోనూ….. వారంతా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రతీ దానికి సాక్ష్యం మీడియాలో బయటకు వస్తోంది.
సిమెన్స్ విషయంలో అడ్డంగా దొరికిన సాక్షి, సీఐడీ
అసలు ఈ ప్రాజెక్టుకు సిమెన్స్కు సంబంధం లేదని… సౌమ్యాద్రి బ్రోస్ అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నారని ఇప్పటి వరకూ సీఐడీ, సాక్షి చెబుతూ వస్తోంది. సాక్షి బ్యానర్ స్టోరీ రాసింది. కానీ నేరుగా సిమెన్స్తోనే ఒప్పందం చేసుకున్నారని తాజాగా సీఐడీ స్వయంగా చెప్పాల్సి వచ్చింది. ఆ సంస్థకు 58 కోట్లే పోయాయన్నారు. మిగతా డబ్బు ఎక్కడికి పోయిందని ఆయన మీడియా సమావేశంలో సగటు వైసీపీ కార్యకర్తలా అడిగారు. అసలు డబ్బులన్నీ ఎక్కడికిపోలేదని ఆధారాలన్నీ సోషల్ మీడియాలో… ఉన్నాయి. ఒప్పంద జరిగింది ఏపీ ప్రభుత్వం, సిమెన్స్, డిజైన్ టెక్ మధ్య… అయినా ఏమీ తెలియనట్లుగా సాక్షి, సీఐడీ తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంది. కానీ ఆధారాలన్నీ ప్రజల ముందే ఉన్నాయి.
లక్షల మంది విద్యార్థులకు జీవితాలనిచ్చిన స్కిల్ ట్రైనింగ్
మరో వైపు సోషల్ మీడియాలో వేల కొద్దీ విద్యార్థులు.. తాము స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణతీసుకున్నామని సర్టిఫికెట్లు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన స్కిల్ సెంటర్ల ఫోటోలు.. వైసీపీ వచ్చిన తర్వాత ప్రచారం చేసుకున్న ఫోటోలు… దేశంలోనే స్కిల్ ట్రైనింగ్ లో నెంబర్ వన్ గా ఏపీకి వచ్చిన అవార్డు అన్నీ ప్రజల ముందు ఉన్నాయి.
కేబినెట్ నిర్ణయం లేకుండా ఏదైనా జరుగుతుందా ?
అసలు మొత్తానికి కేబినెట్ అనుమతి లేదని సీఐడీ చీఫ్ అసువుగా వాగేస్తున్నారు. అసలు కేబినెట్ నిర్ణయం లేకుండా ఒక్క రూపాయి ఖర్చు చేసినా… దాన్ని విడుదల చేసిన అధికారి బాధ్యుడవుతాడు. స్కిల్ ట్రైనింగ్ కోసం అన్ని స్థాయిల్లో కేబినెట్ నిర్ణయాలు జరిగాయి. అన్ని రకాల చట్టబద్దమైన ప్రక్రియ జరిగిందని పీవీ రమేష్ చెబుతున్నారు. అసలు ఫైలే పోయిందని చెబుతూ… ఆ ఫైల్లో ఉన్న వాటి గురించి కోర్టులో చెబుతున్నారు. ఇదెలా చట్టబద్దమవుతుందో ప్రజలే నిర్ణయించుకోవాలి.
ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం అయినట్లుగా చూపించలేకపోయారు !
మాట్లాడితే.. సీఐడీ చీఫ్ సంజయ్.. నిధులదుర్వినియోగం, షెల్ కంపెనీలకు మళ్లింపు అంటారు. ఎలా దుర్వినియోగం అయ్యాయో మాత్రం చెప్పరు. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ అన్నీ వచ్చాయని… అద్భుతమని ఈ ప్రభుత్వమే సర్టిఫై చేసింది. మరి నిధులు ఎలా దుర్వినియోగం అవుతాయి. ఇక షెల్ కంపెనీల పేరుతో కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. ఒక్క లావాదేవీకి ఆధారాలు బయటపెట్టలేదు. ఏమన్నా అంటే ఇంకా దర్యాప్తు జరుగుతోందంటున్నారు.