తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీల పేరుతో ఐదేళ్లు కథలు చెప్పింది కానీ ఒక్క దానికీ పునాదులు వేయలేకపోయింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ చేపడుతుంది. ఇందులో భాగంగా స్కిల్ యూనివర్శిటీ కూడా అవసరమేనన్న అభిప్రాయానికి వచ్చింది. భారీ స్థాయిలో తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీని నెలకొల్పాలని అనుకుంటున్నారు.
తెలంగా ణ సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్శిటీని ప్రకటించడమే కాకుండా ముందస్తుగా క్లాసులు కూడా నిర్వహించేస్తున్నారు. ఈ యూనివర్శిటీకి ఆనంద్ మహింద్రాను చాన్సలర్ గా చేశారు. గతంలో చంద్రబాబు ISBని పూర్తిగా పారిశ్రామిక వేత్తల బోర్డుద్వారానే నడిపేలా ప్లాన్ చేశారు. ఇప్పుడు ఏపీలో పెట్టబోతున్న స్కిల్ యూనివర్శిటీకి కూడా ఆసక్తి ఉన్న ఓ భారీ పారిశ్రామిక వేత్తను చాన్సలర్ ను చేసే అవకాశం ఉంది.
ఏపీలో ఉన్న యువత స్కిల్స్ మొత్తం తెలుసుకుని .. దానికి తగ్గ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది చాలా కంపెనీ లకు మ్యాన్ పవర్ అవసరం అయినా .. సరైన స్కిల్స్ ఉన్న వారు దొరకక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలన్నింటినీ ఈ స్కిల్ యూనివర్శిటీ , స్కిల్ సెన్సెస్ ద్వారా ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేయనుంది.