ఈ యేడాది సూపర్ హిట్టయిన చిన్న సినిమాల్లో ‘బేబీ’ ఒకటి. ఈ సినిమా ప్రమోషన్లలో ‘కల్ట్ బొమ్మ’ అనే పదం చాలాసార్లు ఉపయోగించారు నిర్మాత ఎస్.కే.ఎన్. ఇప్పుడు ఇదే సినిమా టైటిల్ అయిపోయింది. ‘కల్ట్ బొమ్మ’ పేరుతో నిర్మాత ఎస్కేఎన్ ఓ టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఆయన చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. ఇటీవల ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా పట్టాలెక్కించారు. వైష్ణవి హీరోయిన్. మరోవైపు సంతోష్ శోభన్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈ రెండు చిత్రాల్లో ఆయన ‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్ దేనికి ఫిక్స్ చేశారో తెలియాలి. `బేబీ` సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందన్న భరోసాతో ఆనంద్ – వైష్ణవి సినిమాకి ఈ పేరు ఖరారు చేసినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం `బేబీ’ సినిమాని తమిళంతో పాటు, హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు ఎస్కేఎన్. మొత్తానికి సినిమా ప్రమోషన్లలో వాడిన ఓ పదం ఇప్పుడు టైటిల్ గా మారిపోవడం… ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి నిదర్శనంగా నిలుస్తోంది.