హైదరాబాద్ నయా అల్ట్రా లగ్జరీ జీవన శైలికి కేంద్రంగా మారుతోంది. ఎవరూ ఊహించని లగ్జరీతో విల్లాలు, ఫ్లాట్లు నిర్మితం అవుతున్నాయి. ధర కూడా అదే స్థాయిలో ఉంటోంది. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన లగ్జరీ స్కై విల్లా ప్రాజెక్టుల్లో నెంబర్ వన్‌గా జయభేరి ది పీక్ ప్రాజెక్ట్ నిలుస్తుంది. ఇందులో ఒక్క విల్లా రూ.30 కోట్లు పైనే ఉంటుందని అంచనా.
జయభేరి గ్రూప్ డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టు నార్సింగిలో ఉంది. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్స్ , వాక్‌వేలతో అద్భుతంగా ఉంటుంది. మొత్తం మూడు టవర్లు, ప్రతి టవర్ 29 అంతస్తుల ఎత్తుతో నిర్మించారు. మూడో టవర్‌లో ఒక్కో అంతస్తుకు ఒక్క విల్లా ఉంటుంది. మొత్తం మూడు టవర్లు కలిపి 145 విల్లాలు మాత్రమే ఉంటాయి. ఇది లగ్జరీలోనే అల్ట్రా అనుకోవచ్చు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విశాలమైన క్లబ్‌హౌస్, జిమ్, ఇండోర్ గేమ్స్, మల్టీపర్పస్ హాల్, టెంపరేచర్-కంట్రోల్డ్ ఇన్ఫినిటీ పూల్ ఉంటాయి. కాన్సియర్జ్ సర్వీస్, ఆటోమేటెడ్ కార్ వాష్, బిజినెస్ లాంజ్, ప్రివ్యూ థియేటర్, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు ప్రత్యేకంగా ఉన్నాయి.
ప్రతి విల్లా విశాలమైన లివింగ్ ఏరియాలు ఉంటాయి. అద్భుతమైన సీనరి ఎటు చూసినా కనిపిస్తుంది. రెండు టవర్లు స్కైబ్రిడ్జ్ ద్వారా అనుసంధానమైన ఉంటాయి. మూడో టవర్‌లో ఒక్కో అంతస్తుకు ఒక విల్లా మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం జయభేరి ద పీక్‌లో అద్దె మాత్రమే ఐదు లక్షల వరకూ ఉందని చెబుతున్నారు. ఒక్క ఫ్లాట్ రెంట్ ఐదు లక్షలు.. మెయిన్టనెన్స్ యాభై వేలు. అంటే ఏ స్థాయి లగ్జరీ ఉంటుందో అంచనా వేయవచ్చు.
ఈ ప్రాజెక్టు పారిశ్రామిక వేత్తలకు , సెలబ్రిటీలకు, వ్యాపారవేత్తలకు ఇష్టమైన ప్రాజెక్టు. జయభేరీకి ఉన్న ట్రాక్ రికార్డు కారణంగా మార్కెటింగ్ చేయకుండానే ప్రాజెక్టు సేల్ అయిపోయింది.