రియల్ఎస్టేట్ ప్రాజెక్టులు కొత్త కొత్తగా డిజైన్ చేస్తున్నారు. విదేశీ ఆర్కిటెక్చర్ ను అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా ఐటీ కారిడార్ కు కాస్త దగ్గర ఔటర్ పక్కన కొల్లూరులో హై నైన్ అనే ప్రాజెక్టును అన్వితా సంస్థ ప్రారంభించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. తొమ్మిది టవర్లను నిర్మిస్తున్నారు. తొమ్మిది టవర్లను కలుపుతూ స్కైవాక్ నిర్మిస్తారు. అంటే అకాశంలో వాకింగ్ చేసినట్లే అన్నమాట. ఈ కొత్త కాన్సెప్ట్ తో ప్రాజెక్టును సక్సెస్ చేయాలని అనుకుంటోంది.
మధ్యతరగతితో పాటు లగ్జరీ ఇళ్లు కొనాలనుకునేవారి కోసం ఈ హైనైన్లో ఫ్లాట్లు డిజైన్ చేశారు. పదిహేను ఎకరాల్లో తొమ్మిది టవర్లను నిర్మిస్తున్నారు. 30 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పైభాగంలో వాకింగ్ ట్రాక్‌ను డిజైన్ చేశారు తొమ్మిది టవర్లను కలుపుతూ ప్రత్యేకంగా కనెక్టింగ్ బ్రిడ్జీలను ఏర్పాటు చేస్తున్నారు. ఓ ప్రాజెక్టులో ఉన్న టవర్లను కలుపుతూ స్కై వాక్‌లను ఏర్పాటు చేయడం హైదరాబాద్‌లో ఇదే మొదటి సారి అనుకోవచ్చు.
ఎనభై శాతం కంటే అధిక ఓపెన్ స్పేస్ ఈ ప్రాజెక్టులో ప్రఉంటుందని .. ఎక్కడా ట్రాఫిక్ అనేదే ఈ హై నైన్లో కనిపించదని కంపెనీ చెబుతోంది. కోకాపేట్ నుంచి పది నిమిషాల దూరంలోనే కొల్లూరు ఉంటుంది. హైటెక్ సిటీకి ఇరవై నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఈ ప్రాజెక్టుకు మంచి ఆదరణ ఉంటుందని ప్రాజెక్టు చేట్టిన కంపెనీ నమ్మకంగా ఉంది.