ఇల్లు కొనుగోలు చేసేవారు ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్నా పర్వాలేదు అని అనుకోవడంలేదు. తాము కోరుకున్న సౌకర్యాలు, సౌలభ్యాలు ఉంటే మాత్రమే ముందడుగు వేస్తున్నారు. ఇలాంటి ఇళ్ల నిర్మాణమే ఇప్పుడు ఎక్కువగా జరుగుతోంది. హైరైజ్ అపార్టుమెంట్లు అన్ని వర్గాల ప్రజలు కోరుకునే సౌకర్యాలతో నిర్మాణం అవుతున్నాయి. అందుకో వాటికి ఆదరణ పెరుగుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అపార్టుమెంట్లతో ఎలాంటి ప్రయోజనాలు, సౌకర్యాలు ఉంటాయంటే ?
మంచి లొకేషన్ !
స్కై స్ర్కాపర్ అపార్టుమెంట్లు సహజంగా అర్బన్ సెంటర్స్‌లో ఉంటాయి. ఆఫీసులు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ , ఆస్పత్రులు ఇలా అన్ని సౌకర్యాలు చేరువలో ఉండేలా నిర్మిస్తారు. అంటే .. స్ట్రాటజిక్‌గా..అన్ని సౌకర్యాల మధ్యలో నివసిస్తున్నట్లే అనుకోవచ్చు.
సౌకర్యాలు !
హై రైజ్ అపార్టుమెంట్లు అంటే ఓ చిన్న సైజ్ గ్రామం అనుకోవచ్చు. ఎందుకంటే అ ఆపార్టుమెంట్ కాంప్లెక్స్‌లోనే అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాకింగ్ ట్రాక్, జిమ్, టెన్నిస్ కోర్టులు, నెట్ క్రికెట్, వెల్ నెస్ సెంటర్లు, సూపర్ మార్కెట్లు, క్లినిక్కులు.. బ్యాంకు శాఖలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా అపార్టుమెంట్లలో ప్రైమరీ స్కూళ్లు కూడా ఉంటున్నాయి. మంచి వాతావరణంతో అన్ని సౌకర్యాలతో ఈ అపార్టుమెంట్ల ఉంటున్నాయి.
ప్రైవసీ
నేటి సైడర్ యుగంలో ప్రైవసీ అనేది అత్యంత ముఖ్యం. కేవలం మన ఫోన్లను .. గాడ్జెట్స్ ను జాగ్రత్తగా ఉంచుకోవడం ప్రైవసీ కాదు. వ్యక్తిగతగా ఎవరు పడితే వారు డిస్ట్రబ్ చేయకుండా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. కమ్యూనిటీలో ఉన్నా.. ఎవరితోనూ వివాదాలు రాకుండా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. ఇరుగుపొరుగు కూడా మన ఇష్టం ఉంటేనా మనల్ని కలవగలిగేలా ఏర్పాట్లు ఉంటాయి. ఇతర అపార్టుమెంట్లతో పోలిస్తే స్కై స్క్రాపర్స్లో ప్రైవసీ ఎక్కువ.
సౌకర్యవంతమైన లైఫ్ స్టైల్
మాములు అపార్టుమెంట్‌తో పోలిస్తే స్కై స్క్రాపర్ అపార్టుమెంట్లలో జీవనం చాలా సౌకర్యంగా ఉంటుంది. వెసులుబాటును బట్టి ట్రిప్లెక్స్ వరకూ ఉంటాయి. హాల్స్ లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో.. వ్యక్తిగత గదుల్లోనూ అలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. మెయిల్ రూమ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
సెక్యూరిటీ తో పాటు సర్వీస్ కూడా !
ఇల్లు అన్న తర్వాత సెక్యూరిటీ,సర్వీస్ చాలా ముఖ్యం. స్క్రైస్క్రాపర్ అపార్టుమెంట్లలో ఇరవైనాలుగు గంటల పర్యవేక్షణ ఉంటుంది. పూర్తిగా ఓ వాచ్ మెన్ మీద వదిలి పెట్టరు. అత్యాధునిక సర్వైలైన్స్ ఉంటుంది. ఎవరు పడితే వారు లోపలికివచ్చే చాన్స్ ఉండదు. ఇక ఇంటి నిర్వహణ విషయంలో క్షణాల్లో స్పందించే సిబ్బంది ఉంటారు. కరెంట్, ప్లంబింగ్, కార్పెంటర్.. ఇలా ఏ పని వచ్చినా నిమిషాల్లోనే సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు.
పార్కింగ్
స్క్రైస్క్రాపర్స్ అపార్టుమెంట్లలో ఫ్లాట్ ఉన్న వారికి చాయిన్ ను బట్టి మూడు, నాలుగుకార్ల పార్కింగ్‌లను కూడా తీసుకోవచ్చు. అదే సమయంలో తమ ఇంటికి వచ్చే గెస్టులకు అవసరమైన పార్కింగ్ కూడా తాత్కలికంగా కేటాయించవచ్చు. రోడ్లు మీద పార్కింగ్ చేయడం వల్ల కార్లకు రక్షణ ఉండదు. ఇలాంటి అపార్టుమెంట్లలో అన్నివిధాలా రక్షణ ఉంటుంది.
ఆరోగ్య, పర్యావరణ లాభాలు
స్కై స్క్రాపర్స్ లో ఆరోగ్యపరమైన లాభాలు ఉంటాయి. నీటుగా ఉండే వాతావరణం కలసి వస్తుంది. దోమల జాడ ఉండదు. అన్నింటి కన్నా ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉండటం వల్ల ప్రకృతి మధ్య ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
శ్రీమతి మీద ప్రేమ ఉన్న వారు ప్రెస్టీజ్‌ను ఎలా కాదనగలరు అన్నట్లుగా.. మంచి లైఫ్ స్టైల్, సౌకర్యవంతమైన జీవితం, కుటుబంంతోప్రశాంతంగా గడపాలని కోరుకున్నవారు స్కైస్క్రాపర్ అపార్టుమెంట్లను ఎలా కాదనగలరు?