ఈ వారం బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. ఇందులో ముగ్గురు నటులు హీరోలుగా పరిచయం కావడం విశేషం. చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ సిద్ధార్థ్ రాయ్ తో హీరోగా మారుతున్నాడు. ఇపటికే ఈ సినిమా టీజర్ ట్రైలర్ ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల ఛాయలు కనిపించాయి. అయితే చిత్ర బృందం మాత్రం తమది ప్రత్యేకమైన సినిమాని చెబుతోంది. 23న సిద్ధార్థ్ రాయ్ కథ ఏమిటో తెలుస్తుంది. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం హీరోగా చేస్తున్న ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’ సినిమా కూడా ఈ వారమే వస్తుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ. ఈ నగరానికి ఏమైయింది సినిమాలో పాపులర్ డైలాగ్ నే ఈ సినిమాకి టైటిల్ గా పెట్టి అందరినీ ఆకర్షించారు. ‘సుందరం మాస్టర్’ సినిమాతో వైవా హర్ష హీరోగా మారాడు. రవితేజ ఈ సినిమాని నిర్మించడం, ట్రైలర్ ఆసక్తిని పెంచడంతో సినిమాపై ద్రుష్టి పడింది. మొత్తానికి ఈ వారం ముగ్గురు నటులు హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.