ఎట్టకేలకు ధృవ రూపంలో రామ్ చరణ్‌కి ఓ హిట్ దొరికింది. తని ఒరువన్ అంత గొప్పగా లేకపోయినా… తని ఒరువన్ ఫ్లేవర్‌ని ఏమాత్రం తగ్గించలేదని, ఒర్జినల్లో ఉన్న ఫీల్‌ని ఈ సినిమా క్యారీ చేయగలిగిందని విశ్లేషకులు సైతం కితాబులు ఇస్తున్నారు. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా… ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం అంటున్నాయి డ్రేడ్ వర్గాలు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికి ఈ సినిమా రూ.65 కోట్లు (గ్రాస్) సాధించింది. బడ్జెట్, ఈ సినిమాని అమ్మిన రేట్లు ఇవన్నీ లెక్క వేస్తే.. రూ.90 కోట్లకు పైచిలుకు సాధిస్తే గానీ బ్రేక్ఈవెన్ అయ్యే ప్రసక్తే లేదు.
ఈ వారం సినిమాల తాకిడి ఎక్కువగా ఉండబోతోంది. వంగవీటి, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, ఒక్కడొచ్చాడు విడుదలకు సిద్ధమయ్యాయి. మల్టీప్లెక్స్ వసూళ్లపై దంగల్ విపరీతమైన ప్రభావం చూపించే వీలుంది. పైగా ధృవ మల్టీప్లెక్స్ సినిమా అక్కడ.. ధృవ వసూళ్లకు దంగల్ చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో వంగవీటి పై ఫోకస్ ఉంది. కనీసం విజయవాడ, గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో… వంగవీటి ప్రభావం కనిపించబోతోంది. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, ఒక్కడొచ్చాడు బీసీ సెంటర్లలో ఎఫెక్ట్ చూపిస్తాయి. సో.. ధృవకు వసూళ్లకు ఇక చెక్ పడినట్టే. ఎక్కువ ఏరియాల్లో గీతా ఆర్ట్స్ సొంతంగా రిలీజ్ చేసుకొంది కాబట్టి…స్వల్ప నష్టాలొచ్చినా ఫర్వాలేదన్న ధీమాతో ఉంది చిత్రబృందం.