సివిల్ సర్వీస్ ఉద్యోగులు చేయాలంటే శారీరక ధృడత్వం ఉండాలని .. వికలాంగులకు సివిల్ సర్వీస్ ఉద్యోగాలు ఎందుకని స్మితా సభర్వాల్ సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయం సంచలనంగా మారింది. విమానయాన సంస్థ పైలట్‌గా వికలాంగుల్ని నియమిస్తుందా ? వైకల్యం ఉన్న వైద్యుడ్ని నమ్ముతారా ? అంటూ తన మానసిక వైకల్యాన్ని బయట పెట్టుకున్నారు. సివిల్ సర్వీసులు అంటే క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించిన ఉద్యోగాలు అని వీటికి శారీరక ధృడత్వం చాలా అవసరం అని చెప్పుకొచ్చారు. ఇలాంటి అత్యున్నత సర్వీసుల్లో శారీరక వైకల్యం ఉన్న వారిని ఎంపిక చేయడంపై ఆలోచించాలన్నారు.
Also Read: ఫ్యాక్ట్ చెక్ : స్పీకర్ బిర్లా కూతురు ఐఏఎస్సా ?
స్మితా సభర్వాల్ లా అందరూ ఉండాలని ఆమె కోరుకుంటున్నారేమో కానీ.. ఆమె వ్యాఖ్యలు మాత్రం.. ఓ ఐఏఎస్ అధికారి స్థాయి ఆలోచన స్థాయికి తగ్గట్లుగా లేదని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచంలో ఎంతో మంది వికలాంగులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు. వైకల్యం ఉన్న వారు కూడా.. అన్ని బాగున్న వారిని మించి శక్తి, మేధస్సను ప్రదర్శించి ప్రపంచానికి ప్రత్యేక దారి చూపారు. బ్యూరోక్రాట్లు.. తాము ఏదో పై నుంచి దిగి వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని స్మితాసభర్వాల్ పోస్ట్ చూస్తే అర్థమవుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తన ప్రత్యేక ప్రతిభను చూపి ఆమె ప్రభుత్వ పెద్దల అభిమానం పొందారు. సీఎంవోలో చక్రం తిప్పారు. అలాగే కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అప్రాధాన్య పోస్టుకు వెళ్లారు., పెద్దగా ప్రచారం లభించడం లేదని అనుకుంటున్నారమో కానీ.. వివాదస్పదమైన పోస్టు పెట్టారు. వార్తల్లోకి వచ్చారు.