తెలంగాణలోని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. తాను సీఎంవోలో పని చేసినా తన కారుకు అద్దె పేరుతో ఆమె ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటీ నుంచి రూ.61 లక్షల రూపాయలు బిల్లులు పెట్టి వసూలు చేసుకున్నారు. ఇటీవల జయశంకర్ వర్శిటీలో నిధుల దుర్వినియోగం, అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయిచింది. ఈ విచారణలో స్మితాసభర్వాల్ కు రూ.61 లక్షలు చెల్లించినట్లుగా తెలింది. ఎందుకా అని ఆరా తీస్తే కారు అద్దె అని బిల్లులు పెట్టుకున్నారు.దీంతో ఆమెకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు.
స్మితా సభర్వాల్ తన కారుకు అద్దె పేరుతో నెలకు రూ.61వేల రూపాయలు బిల్లులు పెట్టుకున్నారు. రెగ్యులర్ గా తన కార్యాలయం నుంచి బిల్లులు జయశంకర్ యూనివర్సిటికీ వెళ్లేవి. మంజూరు చేసేవారు. ఆడిట్లో ఈ బిల్లులు పై పరిశీలన చేస్తే అసలు అద్దెకు తీసుకున్న కారు .. ట్రావెల్స్ ది కాదని..కనీసం టాక్స్ కట్టేది కాదని తేలింది. పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద పేరు ఉంది. ఇది వ్యక్తిగత వాహనం. వ్యక్తిగత వాహనం నిబంధనల ప్రకారం అద్దెకు ఇవ్వడం కుదరదు. మరి స్మితా సభర్వాల్ ఎవరి కారు అద్దెకు తీసుకున్నారు ?
స్మితాసభర్వాల్ సీఎంవోలో కీలకంగా పని చేశారు. ప్రగతిభవన్ లోనే ఆమె కార్యాలయం ఉంటుంది. కేసీఆర్ ఆమెకు నీటి పారుదల, ప్రాజెక్టులు వంటి శాఖల్ని అప్పగించారు. ఆమె చాలా సార్లు హెలికాఫ్టర్లలో కూడా వెళ్లి ప్రాజెక్టుల్ని చూసి .. సమీక్ష చేసి వచ్చారు. అలాంటిది.. జయశంకర్ యూనివర్శిటీ నిధుల్ని కారు అద్దె పేరుతో తీసుకోవడం..వివాదాస్పదంగా మారుంది. ఆమెకు నోటీసులు జారీ చేసి వివరణ అడిగి ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.