మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగబోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో టూరిజం బాధ్యతలు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ప్రభుత్వం తరపున సౌకర్యాలు కల్పించి ఈ పోటీలు తెలంగాణలో జరిగేలా ఒప్పించారు. మిస్ వరల్డ్ పోటీలతో .. తెలంగాణ టూరిజానికి మరింతగా ఫోకస్ వచ్చేలా చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇందు కోసం ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుందో కానీ.. హైదరాబాద్కు మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మిస్ వరల్డ్ పోటీల కోసం చాలా నగరాలు పోటీ పడుతున్నాయి. ఈ సారి ఇండియాలో నిర్వహించాలనుకున్నారు. ముంబై గట్టిగా ప్రయత్నించింది. స్మితా సబర్వాలా మాత్రం గట్టిగా ప్రయత్నించి హైదరాబాద్ కు అవకాశం వచ్చేలా చేశారు. మిస్ వరల్డ్ పోటీలపై గ్లామర్ వరల్డ్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అంతర్జాతీయ సెలబ్రిటీలు వస్తారు. అంతే కాదు.. ఈ పోటీలను విభిన్నమైన ప్రాంతాల్లో వేర్వేరు విభాగల్లో నిర్వహిస్తారు. అవన్నీ తెలంగాణ టూరిజానికి ప్రపంచవ్యాప్త గుర్తిపు వచ్చేలా చేయనున్నాయి.
టూరిజం పరంగా హైదరాబాద్ కు మంచి గుర్తింపు ఉంది. గోల్కొండ నుంచి ఫిల్మ్ సిటీ వరకూ పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. అయితే ఇంకతా అంతర్జాతీయంగా ఫోకస్ రావాల్సి ఉంది. ఇంకా తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన టూరిజం ప్రాంతాల గురించి ప్రచారం జరగాల్సింది ఉంది . మిస్ వరల్డ్ పోటీలతో ఆ ప్రచారం లభించేలా .. ప్రభుత్వం, స్మితా సబర్వాల్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోనున్నారు.