చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పాము కాటుకు గురయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ పొట్టిసుబ్బయ్యపాలెంలో వాకింగ్ చేస్తుండగా ఆయనను పాము కాటేసింది. పందిళ్లపల్లి అక్వా నర్సరి వద్ద సొంత రొయ్యల ఫ్యాక్టరీలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాలిపై ఏదో కుట్టినట్లుగా ఉందని అనిపించి చూడటంతో… పాము కాట్ల గుర్తులు కనిపించాయి. ఏ పాము కుట్టిందో తెలియకపోవడంతో వెంటనే.. విషం పైకి పాకకుండా.. కర్చీఫ్‌తో కాలికి కట్టు కట్టి… ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మొదట చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆమంచి కృష్ణ మోహన్ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైసీపీ నేత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. 6 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచినట్లు వైద్యులు ప్రకటించారు. కట్ల పాము కరిచి ఉంటుందని… ఆ పాము విషయం ప్రమాదకరం కాదని వైద్యులు చెబుతున్నారు. ఆరు గంటల అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేస్తామంటున్నారు.
ఆమంచి ని కరిచించి ఏదో పామో స్పష్టత రాకపోవడం వల్లే వైద్యం కూడా అస్పష్టతగా ఉందంటున్నారు. శరీరంలో వచ్చే మార్పుల్ని బట్టి చికిత్సపై నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికైతే ప్రమాదకర సంకేతాలులేవంటున్నారు. ఆయన సోదరుడు స్వాములు ఇటీవలే.. జనసేన పార్టీలో చేరారు.