వినాయక చవితి వస్తుందంటే చాలు… ప్రతి సంవత్సరం వార్తల్లో ఉండే అంశం నిమజ్జనం ఎక్కడ అని? హైదరాబాద్ మహానగరంలో నిమజ్జనం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది హుస్సేన్ సాగర్- ట్యాంక్ బండ్. కానీ, రసాయనాలతో చేసిన గణనాథులను సాగర్ లో నిమజ్జనం చేయటం పట్ల గతంలోనే ఎన్నో పిటిషన్లు దాఖలు కాగా… హైకోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది.
హైకోర్టు నిర్ణయం ప్రకారం కేవలం మట్టి గణపయ్యలనే సాగర్ లో నిమజ్జానానికి అనుమతి ఇవ్వాలి. రసాయనాలు, పాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వాటిని అనుమతించవద్దు అని. కానీ, ప్రభుత్వం గతంలో కొన్ని మినహాయింపులు తెచ్చుకొని నిమజ్జనాన్ని పూర్తి చేసింది.
ఈ ఏడాది మరోసారి ఈ అంశం కోర్టుకు ముందుకు వచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని… సాగర్ ను కాపాడాలంటూ పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే విచారణ కూడా జరిగింది. ఇందులో తాజాగా ఈసారి హైడ్రాను కూడా ప్రతివాదుల లిస్ట్ లో చేర్చాలని పిటిషనర్ వాదించారు.
ఇప్పటికే నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో… హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓకే. కానీ, నో చెప్తే ఏం చేయాలన్నది కీలకం కాబోతుంది. ఈ ఏడాదికి కూడా తాత్కాలిక అనుమతి కోరుతారా? ప్రభుత్వం మారిన అధికారులంతా ఒక్కరే కాబట్టి కోర్టు నో చెప్తుందా? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. మంగళవారం దీనిపై హైకోర్టు కీలక తీర్పు రాబోతుంది.