వైసీపీలో సామాజిక న్యాయం జగన్ చెప్పినట్లే ఉంటుంది. అంతా ఒక వర్గానికే ప్రాధాన్యత లభిస్తుంది. తాజాగా వైసీపీకి అనుబంధ సంఘాల అధ్యక్షుల్ని ప్రకటించారు. మొత్తం ఇరవై రెండు సంఘాలకు అధ్యక్షుల్ని ప్రకటించారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వాణిజ్యం మినహా అన్ని విభాగాలకు అధ్యక్షులు రెడ్డి సామాజికవర్గం వారే ఉన్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, చైతన్య రెడ్డి, గౌతం రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పోసింరెడ్డి, మేడపాటి వెంకట్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి , కల్పలతా రెడ్డి ఇలా పేర్ల వరుస సాగింది.
బీసీ విభాగానికి.. ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ, చేనేత విభాగానికి వారినే నియమించాలి కాబట్టి తప్పలేదు. వాణిజ్య విభాగానికి ఏపార్టీ అయినా వైశ్యులకు చాన్స్ ఇస్తుంది. ఒక్క వికలాంగుల విభాగానికి బెందల కిరణ్ రాజును ఇతర వర్గం నుంచి నియమించారు. నిజానికి వీరిలో చాలా మంది గతం నుంచి ఉన్నవారే. కొత్తగా నియమిస్తున్నట్లుగా ప్రకటించారు. బీసీ విభాగానికి అధ్యక్షుడిగా జంగా కృష్ణమూర్తి ఉన్నప్పటికీ.. బీసీ వ్యవహారాలన్నింటినీ విజయసాయిరెడ్డి నిర్వహిస్తూంటారు.
ప్రభుత్వంలోనే కాదు పార్టీలోనూఇదే పరిస్థితా అని ఆ పార్టీ నాయకులు గింజుకుటూ ఉంటారు. విధులు.. నిధులు ఉండని పదవులు మొత్తం బీసీ వర్గాలకు కేటాయించారని.. పవర్ ఉన్న పదవులు రెడ్లకు కేటాయించారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.