ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి.. పోలీసుల దర్యాప్తు తీరు లాంటివన్నీ ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా శ్యామ్ అనే ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈస్ట్ గోదావరి జిల్లా చింతలూరుకు చెందిన శ్యామ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎన్టీఆర్ కు వీరాభిమానిగా ఉంటారు. అయితే ఇంట్లో హఠాత్తుగా చనిపోయి కనిపించారు. మొదట ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.
కానీ శ్యామ్ మృతదేహం ఫోటో బయటపడిన తర్వాత అనేక అనుమానాలు బలపడుతున్నాయి. ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేకపోగా.. చేతులకు గాయాలున్నాయి. అలాగే నోట్లో గంజాయి ని పెట్టి ఉన్నారు. గంజాయి నోట్లో కుక్కినట్లు ఉండటం… చేతికి కత్తిరించిన గాయాలు ఉండటంతో ఇది ఆత్మహత్య కాదని సోషల్ మీడియాలో పోలీసుల్ని ప్రశ్నించడం ప్రారంభించారు. గ్రామంలో వైసీపీ కార్యకర్తలతో జరిగిన గొడవల తర్వాతనే శ్యామ్ చనిపోయాడన్న ప్రచారం ప్రారంభం కావడంతో విషయం రాజకీయం అయింది.
శ్యామ్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ తరపున యాక్టివ్ గా ఉంటారు. అందుకే శ్యామ్ నెటిజన్లకు చిరపరిచితం. ఆయన మరణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. #WeWantJusticeForShyamNTR హ్యాగ్ ట్యాగ్ పేరుతో వైరల్ చేస్తున్నారు. . టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్ తో పాటు … టీడీపీ ముఖ్యనేతలంతా స్పందించారు. అలాగే రాజకీయాలకు సంబంధించి సినిమా రివ్యూయర్లు.. ఇతర హీరోల అభిమానులు కూడా పోలీసులు నిష్ఫాక్షిక విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కారణం ఏదైనా సినిమాలు,, రాజకీయాల్లో విబేధాలు వ్యక్తిగత కక్షలుగా చేర్చుకుని చంపుకోవాలన్న ఆలోచనను తీసుకొచ్చేలా కొంత మంది మార్చేయడంతో… వ్యవస్థ అంతా వినాశనం అవుతోంది. దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి..