సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి అడిగి అడిగి అలసిపోయి ఇక ఆయన పెళ్లి గురించి మర్చిపోయారు కానీ.. రాహుల్ గాంధీని మాత్రం సోషల్ మీడియా వదిలి పెట్టడం లేదు. ఏదో ఓ మాట వెదుక్కోవడం.. దాన్ని పట్టుకుని ఇదిగో రాహుల్ పెళ్లి అనడం కామన్ అయిపోయంది. ఇటీవల రాహల్ కశ్మీర్ లో పర్యటించినప్పుడు విద్యార్థులు పెళ్లి గురించి అడిగారు.. ఇంకా ప్లాన్ చేయలేదు కానీ అవుతుందని రాహల్ అన్నాడు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ ను కలిసినప్పుడు కూడా అన్నారు. అంతే సోషల్ మీడియా విశ్వరూపం చూపించేందుకు రెడీ అయిపోయింది.
షోలాపూర్ ఎంపీ ప్రణతి షిండేతో రాహుల్ గాందీ చేతిలో చేయి వేసి నడుస్తున్న ఫోటోను వైరల్ చేస్తున్నారు. వారిద్దరికి పెళ్లంట అని టాం టాం చేస్తున్నారు. ప్రణతి షిండే.. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె. నిజానికి రాహుల్ గాంధీ ఎవరు కలిసినా ఆప్యాయంగా అలా చేతిలో చేయి వేసి నడుస్తారు. అందులో ద్వంద్వార్థులు ఉండవు.కానీ చాలా మంది బీజేపీ కార్యకర్తలకు అలాంటి ఫోటోలే పెద్ద ఆయుధాలు అయిపోతున్నాయి. ఆయన పెళ్లి గురించి ప్రకటనలు చేసేస్తున్నారు.
రాహుల్ పెళ్లి విషయంలో ఓ మహిళ పేరును ప్రధానంగా ప్రస్తాbన తెచ్చి ప్రచారం చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఓ మహిళా నేతలపై ఇలాగే ప్రచారం చేశారు.కానీ తర్వాత తేలిపోయింది. ఇప్పుడు ప్రణతి షిండే దాకా వచ్చారు. ఇంకా రాహుల్ లేదా .. ప్రణతి కుటుంబం వైపు నుంచి ఖండనలు రాలేదు. వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యే అవకాశం ఉంది.