అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు పోలీసు అధికారిని పులివెందుల ఎమ్మెల్యే జగన్ బెదిరించడం తీవ్ర వివాదాస్పదం అయింది. ఎన్నికల్లో చిత్తు, చిత్తుగా ఓడించినా జగన్ వ్యవహారశైలిలో మాత్రం మార్పు లేదని విమర్శలు వచ్చాయి. అయితే, వైసీపీ అనుకూల మీడియా.. సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా జగన్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు.
ఓటమి నుంచి త్వరగా కోలుకొని ప్రభుత్వ విధానాలపై పోరుబాట పట్టారని జగన్ ను కీర్తిస్తూ వ్యాఖ్యానాలు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారిని బెదిరించడం పోరుబాట పట్టడం ఎలా అవుతుందో ఎవరికీ అర్థం కాలేదు. వైసీపీకి మాత్రమే అలా తోచింది. కొసమెరుపు ఏంటంటే..జగన్ అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్ష పాత్రలోనే యాక్టివ్ గా ఉంటున్నారని పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.
Also Read : శ్వేతపత్రాలపై జగన్ మౌనం ఎందుకు?
పోలీసు అధికారిని బెదిరించిన సంఘటనపై జగన్ కు ఇచ్చే ఎలివేషన్స్ చూస్తుంటే…జగన్ ను ఇలాగే ప్రతిపక్షంలోనే ఉంచాలని వైసీపీ సోషల్ మీడియా సిద్దమైందా..? అనే అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ జగన్ కు ఎలివేషన్స్ ఇవ్వడం వైసీపీ ఘోర ఓటమికి ఓ కారణం. అయినప్పటికీ ఇంకా వైసీపీ సోషల్ మీడియా వాస్తవాలను గుర్తెరగకుండా..వివాదాస్పద అంశాన్ని కూడా గ్లోరిఫై చేసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.