వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో సోషల్ మీడియా కార్యకర్తల పాత్ర తీసి వేయలేనిది. నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా కార్యకర్తల్ని ఎంపిక చేసి.. వారితో పోస్టుల్ని వైరల్ చేయడం.. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి… సోషల్ మీడియా విభాగం నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తూ.. పార్టీకి హైప్ తేవడం వరకూ.. వారి పాత్ర ఎనలేనిది. ఆ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు… ఎన్నికల వ్యవహారాలను మొత్తం ఒంటి చేత్తో నడిపించిన విజయసాయిరెడ్డి పదే పదే చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వారంతా అసంతృప్తిలో ఉన్నారని… పార్టీ కోసం కష్టపడినా.. తమకు ఎలాంటి ఉపయోగం ఉండటం లేదన్న భావన మెజార్టీ సోషల్ మీడియాకార్యకర్తల్లో బలపడిపోయింది.
అందుకే ప్రత్యేకంగా తాడేపల్లిలో ఆత్మీయ సమావేశం పెట్టిన విజయసాయిరెడ్డి.. ప్రతీ రోజు అందరికీ ఒకే మాట పదే పదే చెబుతున్నారు. అందరి సమస్యలు పరిష్కరిస్తానని.. ఎవరూ అసంతృప్తి చెందాల్సిన పని లేదు.. పార్టీ అండగా ఉంటుందని చెబుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు.. పార్టీ కోసం పని చేసినందున..తమకు.. .చిన్న చిన్న పనులు… ఇవ్వాలని చాలా చోట్ల నుంచి కోరుతున్నారు. కానీ.. అలా ఇచ్చే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు.. వైసీపీ ఇన్చార్జులే.. ఆ పనులు మొత్తాన్ని తాము చేయడమో.. తమ అనుచరులకు ఇవ్వడమో చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు చాలా మంది… ఎమ్మెల్యేల అనుచరులు కాదు. ఒక వేళ అయినా… పనులిచ్చేంత చనువు ఉండటం లేదు. ఈ కారణంగా… పార్టీలో తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. అదే సమయంలో… కేసులు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఉపసంహరించుకోలేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం వైసీపీదే ఉన్నా కేసులు తప్పడం లేదనే ఆందోళనలో ఉన్నారు. వారి అసంతృప్తిని తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని.. విజయసాయిరెడ్డి పదేపదే భరోసా ఇస్తున్నారు. అయితే సోషల్ మీడియా కార్యకర్తలతో విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రసంగాలు ఇస్తున్న భరోసాల్లో.. ఆయన అసంతృప్తే ఉందికానీ.. సోషల్ మీడియా కార్యకర్తలది కాదని.. ైసీపీలోని ఆయన వ్యతిరేక వర్గీయులు అంటున్నారు.