ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం.. నేడో..రేపో ఎన్నికలన్నట్లుగా మారిపోయింది. ఎన్నికలు ముగిసి.. మూడు నెలలు మాత్రమే అయింది. అందరూ.. ప్రజల్లోకి వచ్చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఎన్నికలకు ముందు ఎంత పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు.. వేల మంది సోషల్ మీడియా వలంటీర్లను ఏర్పాటు చేసుకుని దుమ్మెత్తి పోసుకున్నాయో… ఇప్పుడూ ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా పోరాటం జరుగుతోంది. అయితే.. ఇది రోజు రోజుకు దిగజారిపోతోంది. నాయకుల మీద శ్రద్ధాంజలి పోస్టులు పెడుతున్నారు. నేతలపై అసభ్య రాతలు రాస్తున్నారు. ఈ కోణంలో… పోలీసులకు వందల ఫిర్యాదులు వస్తున్నా.. ఒక్క వైసీపీ ఫిర్యాదుపైనే స్పందించి అరెస్టులు చేస్తున్నారు. దాంతో రాజకీయం రాజుకుంటోంది.
జగన్‌పై విమర్శలు చేశారని… పదుల సంఖ్యలో అరెస్టులు..!
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ… గత మూడు నెలల కాలంలో కనీసం పదిహేను మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో విద్యార్థులు కూడా ఉన్నారు. చివరికి తెలంగాణకు చెందిన ఓ యువకుడ్ని కూడా.. పట్టుకొచ్చి జైల్లో వేశారు. కొంత మందిని పెయిడ్ ఆర్టిస్టులంటూ… జైల్లోనే పెట్టి హింసిస్తున్నారనే ఆరోపణలనూ కుటుంబసభ్యులు చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది.. వైసీపీ నేతలు.. ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు వద్దని సుప్రీంకోర్టు చెప్పినా.. ఏదో… లింక్ పెట్టుకుని… కేసులు నమోదు చేస్తున్నారు.
ఇతర పార్టీల నేతల ఫిర్యాదులపై మాత్రం స్పందించని పోలీసులు..!
వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తే.. అరెస్టులు చేస్తున్న పోలీసులు.. ఇతర పార్టీలు తమపై దారుణంగా.. వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. మాజీ మంత్రి మాణిక్యాలరావు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని… ఆయనకు శ్రద్ధాంజలి అంటూ… విపరీతంగా పోస్టులు వైరల్ చేశారు. దీనికి కారణం.. ఆయన జగన్మోహన్ రెడ్డి సర్కార్ ను తీవ్రంగా విమర్శించడమే. దీనిపై.. ఆయన … పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కనీసం పట్టించుకోలేదు. అలాగే… టీడీపీ అధినేతను.. రనురాజశ్వరి అనే కార్యకర్త కలిసినప్పటి ఫోటోలను… వైసీపీ సోషల్ మీడియా అత్యంత అసభ్యకరంగా ప్రచారం చేసింది. ఓ బీసీ మహిళ అని చూడకుండా.. ఆమె క్యారెక్టర్ ను కించపరిచేలా.. ఇంటూరి రవి అనే సోషల్ మీడియా ఇన్చార్జ్ పోస్టులు పెట్టడం .. కలకలం రేపింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారు లైట్ తీసుకున్నారు. దాంతో.. ఆ మహిళకు మద్దతుగా టీడీపీ మహిళా నేతలంతా ప్రెస్ మీట్ పెట్టి … ప్రభుత్వం .. పోలీసులు.. వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తీరుపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. .
జనసేన ఫిర్యాదుతో పోస్టు డిలీట్ చేసిన వైసీపీ..!
సోషల్ మీడియాలో తాము ఎవర్నీ.. ఎలాంటి మాటలు అయినా అనొచ్చని.. వైసీపీ నేతలు అనుకుంటున్నారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి.. ఇ తర పార్టీల నేతల కుటుంబసభ్యులను కూడా … ఎంత మాటలైనా అనే స్వచ్చ ఉన్నట్లుగా ఫీలవుతున్నారు. అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ పైనా అలాగే పెట్టారు. రూ. రెండువేల కోట్లు బ్లాక్ మనీ… వైట్ చేసుకున్నారంటూ.. పెట్టిన పోస్టుపై… జనసేన.. హైదరాబాద్‌తో పాటు ఏపీలోనూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. ఎందుకైనా మంచిదనుకున్నారేమో కానీ.. వెంటనే ఆ పోస్టును డిలీట్ చేశారు.
ఏపీ రాజకీయం నేడో రేపోఎన్నికలన్నంత హాట్ హాట్ గా ఉంది. అయితే.. దానికి ఏ మాత్రం సభ్యత, సంస్కారాలు పాటించనంత దారుణంగా… విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవాల్సిన పని లేదు. కానీ.. ఏపీ రాజకీయాల్లో అది కూడా.. ఎవరికీ పట్టడం లేదు. కట్టడి చేయాల్సిన పోలీసులు.. ఒకరికే మద్దతు పలుకుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.