హైదరాబాద్: 2002లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌ను నిర్దేషిగా బాంబే హైకోర్ట్ నిన్న తీర్పు ఇవ్వటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు సల్మాన్ నిర్దోషిత్వాన్ని ఎద్దేవా చేస్తూ పలు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో జోకులు పేలుతున్నాయి. ట్విట్టర్లో నిన్న ఈ కేసు నేపథ్యంలో #salmanverdict అనే ఒక హ్యాష్‌ట్యాగ్ పెట్టగా అది టాప్ ట్రెండింగ్‌లో ఉంది. నెటిజన్లు రకరకాలుగా ఈ కేసుపై వ్యాఖ్యానాలు చేస్తూఉన్నారు. ‘గూగుల్ ఇంకా డ్రైవర్‌లెస్ కార్లను విడుదల చేయలేదు… సల్మాన్‌కు మాత్రం 2002లోనే డ్రైవర్‌లెస్ కార్ ఉంది’ అని ఒకరు, ‘ఇండియాలో ఆటో పైలట్ కార్లు ఉన్నాయా’ అని మరొకరు, ‘2002లోనే ఇండియాలో డ్రైవర్‌లెస్ కార్లు కనిపెట్టారు’ అని ఇంకొకరు ట్వీట్లు చేశారు. ‘సల్మాన్ కారు మద్యం సేవించి ఉంటుంది… అందుకే ఈ ప్రమాదం జరిగింది’ అని మరికొందరు ట్వీటారు.