ఈసారి సంక్రాంతి బరిలో ఎన్నడూ లేని విధంగా నాలుగు సినిమాలు అంటే మూడు పెద్ద సినిమాలు, ఓ చిన్న సినిమా విడుదలవ్వడం.. నాలుగు హిట్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. అయితే వారాలు గడుస్తున్నా కొద్ది రేసులో నిలబడ్డవి మాత్రం రెండు సినిమాలు నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయనా. తారక్ అద్భుత నటన, సుకుమార్ ఇంటె లెక్చువల్ డైరక్షన్ వెరసి నాన్నకు ప్రేమతో మొదట టాక్ వేరేగా వచ్చినా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. జూనియర్ కు ఎన్నాళ్లగానో అందుకోవాలనుకుంటున్న 50 కోట్ల మార్క్ ను టచ్ చేసి తన పరువు నిలబెట్టింది ఈ సినిమా.
ఇక ఎటువంటి అంచనాలు లేకుండా కొత్త దర్శకుడితో రంగంలోకి దిగిన సోగ్గాడు మొదటి షో నుండి హౌజ్ ఫుల్స్ తో నడుస్తున్నాడు. అని చోట్లా ఎలా ఉన్నా ఓ ఏరియాలో నాన్నకు ప్రేమతో సినిమాను క్రాస్ చేశాడు సోగ్గాడే చిన్ని నాయనా. నైజాంలో నాన్నకు ప్రేమతో 10.40 కోట్లను వసూలు చేయగా.. సోగ్గాడు 10.50 కోట్లతో ముందంజలో ఉన్నాడు. ఇప్పటివరకు సోగ్గాడు 40 కోట్ల షేర్ ను కలెక్ట్ చేశాడని ట్రేడ్ టాక్.
బంగార్రాజు, రాముల్లా నాగార్జున అద్భుత నటన, కుటుంబమంతా చూడదగ్గ మంచి ఎంటర్టైనర్ గా వచ్చి సోగ్గాడు సూపర్ హిట్ కొట్టాడు. నైజాంలో అద్భుతమైన వసూళ్లతో మరోసారి నాగ్ తన సత్తా చాటుకున్నాడు.