సంక్రాంతి పండుగ వచ్చిందంటే పల్లెల్లో వేడుకల్లోలానే సినిమాల విడుదల హంగామా కూడా అలానే ఉంటుంది. ఈ నెల 13న నాన్నకు ప్రేమతోతో మొదలైన సినిమాల హడావిడి 14న డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజాలతో పాటుగా 15న సోగ్గాడే చిన్నినాయనాతో ముగిసింది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన నాన్నకు ప్రేమతో ఏ క్లాస్, మల్టిప్లెక్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకోగా, డిక్టేటర్ మాత్రం ఫుల్ మాస్ అంశాలతో బాలయ్య అభిమానులను ఇంప్రెస్ చేసింది.
ఇక ఎక్స్ ప్రెస్ రాజా అంటూ ఎక్స్ ప్రెస్ వేగంతో వచ్చిన శర్వా సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ తో నింపి హిట్ కొట్టాడని అంటున్నారు. ఇక లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అంటూ వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా ఎటువంటి అంచనాలు లేకుండానే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి షో నుండి ఈ సినిమాకు హిట్ రావడం విశేషం.
అంతేకాదు నిజమైన సంక్రాంతి సరదాలు తీర్చే విధంగా ఈ సినిమా ఉంది అంటున్నారు. పల్లెటూరు వాతావరణంలో ఈ సినిమా ఉండటం సినిమాకు కలిసి వచ్చిన అంశం. ఇక ఎప్పటిలానే బంగార్రాజు, రాము రెండు విభిన్న పాత్రల్లో కింగ్ నాగార్జున నటన మరోసారి అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ లెక్కన సంక్రాంతి నాడు వచ్చిన సోగ్గాడే కుటుంబమంతా చూడదగ్గ సినిమాగా నిలిచిందని అంటున్నారు విశ్లేషకులు.