బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు అభిజిత్. మూడో స్థానంలో సోహెల్ వచ్చాడు. అయితే అభిజిత్ కంటే ముందుగా సోహెలే సినిమా ఛాన్స్ కొట్టేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఇలా బయటకు వచ్చాడో లేదో.. ఓ సినిమాపై సంతకం చేసేశాడు. శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వం వహిస్తున్నారు. అప్పిరెడ్డి నిర్మాత.
“మహిళల మనసు గెలుచుకునే కథ ఇది. ఈ కథ నిజంగానే వేరేలా ఉంటుంది. టైటిల్ తో పాటు మిగిలిన వివరాలు త్వరలో ప్రకటిస్తామ“న్నాడు సయ్యద్. తాను నిర్మాతగా ఓ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఇందులో సోహైల్ నే హీరోగా నటిస్తాడు. ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ పోషించడానికి చిరంజీవి, బ్రహ్మానందం సిద్ధమైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 4తో.. సెలబ్రెటీల మనసుల్ని గెలుచుకున్నాడు సోహైల్. కాబట్టి తన సినిమా అంటే.. ఎంతో కొంత క్రేజ్ ఉండడం ఖాయం. మరోవైపు బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కి సైతం ఆఫర్లు వస్తున్నట్టు టాక్. అయితే ఇప్పటి వరకూ అభిజిత్ ఏ కథనీ ఓకే చేయ్యలేదని తెలుస్తోంది.