మెగాస్టార్ చిరంజీవి ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనిపించుకున్నారు. తన స్టామినా మరోసారి నిరూపించారు. మెగా స్టార్ రీఎంట్రీ చిత్రం, 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ కొత్త రికార్డ్ నెలకొల్పింది. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ చిత్రం వందకోట్ల కబ్ల్ లో చేరింది. ప్రస్తుతం కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు మెగాస్టార్. చిరు 151వ చిత్రంగా’ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ దాదాపుగా ఖారారు అయ్యింది. అలాగే ఈ చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరు ఖాయమైయింది.’ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’.. చిరంజీవి కోసం పరుచూరి బ్రదర్స్ తయారుచేసిన స్క్రిప్ట్. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే చిరంజీవి 150సినిమాగా ఈ చిత్రమే రూపుదిద్దుకొనేది. అయితే ఎందుకో ఈ స్క్రిప్ట్ పక్కకు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడీ కధ మళ్ళీ తెరపైకి తీసుకువచ్చారుచిరంజీవి. తన 151వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని ఫిక్స్ చేసుకున్నారు.
దీంతో ఇప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పేరు టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది. అసలు ఇంతకి ఎవరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.? ఆయన చరిత్ర ఏమిటి? ఆ చరిత్ర సినిమాకి సరిపోతుందా? అసలు ఆయన చరిత్రను సినిమాగా తీయాల్సిన అవసరం వుందా? అంటే ఖచ్చితంగా వుందని చెప్పాలి. సరిగ్గా చెప్పాలేగానీ హీరోయిజం ఎవరెస్ట్ స్థాయిలో వున్న కధ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ది
ఆయన గురించి పరిచయం చేయాలంటే.. .బ్రిటీష్ పాలకుల చేతిలో దేశ ప్రజలు విలవిలలాడుతున్న రోజులవి. ప్రజలు ఆక్రోశంతో,ఆవేధనతో మరిగిపోతున్న సమయమది. పరాయి దేశపు పాలనలో బ్రతకలేక..చావ లేక నరకం అనుభవిస్తున్న కాలమది. సరిగ్గా అప్పుడే..ప్రజల ఆవేశం నుంచి ఓ ఉప్పెన కెరటాల్లా దూసుకొచ్చింది. దిక్కులు పెక్కుటిల్లెలా సీమ సింహం గర్జించింది. పరాయి పాలనపై యుధ్దం ప్రకటించింది. ఆ ఉగ్ర నరసింహుడే… ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సిపాయిల తిరుగుబాటు కు పదెళ్ల ముందే తెల్లదొరలపై సమర శంఖం పూరించాడాయన. బానిస బ్రతుకులను కాపాడటం కోసం ప్రాణాలొడ్డి పోరాడాడు.తెల్లదొరలపై తొలిసారి తిరుగుబాటు చేసిన తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి కర్నూలు జిల్లోలో జన్మించా రు.పెరిగింది ఉయ్యాల గ్రామంలో. ఈయనకు 66 గ్రామాల్లో 2వేల సైన్యం ఉండేది. నరసింహరెడ్డి తండ్రి పేరు పెద్ద మల్లారెడ్డి. తాత జయరామి రెడ్డి. వీరిని ఆ కాలంలో పాలేగాండ్లు అనేవారు. నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. అనంతపురం, కర్నూలు,భళ్లారి జిల్లాల్లో నరసింహారెడ్డి హావా కొనసాగుతుండేది. ఆ ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేవారు. రక్షణ కవచంలా ఉండే వాళ్లు. సంక్షేమ పథకాలు కూడా చేసేవారు. బావులు,చెరువు తవ్వించి ..రాయసీమను రతనాల సీమగా మార్చినవారిలో నరసింహారెడ్డి ఒకరు. ఆయనకు కత్తియుద్ధంలో ప్రావీణ్యం వుంది. అలాగే తనకంటూ ఒక ప్రైవేట్ సైన్యం వుంది. కాలక్రమంలో బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు,మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది. బ్రిటీష్ వారి ఆగడాలు మరీ మితిమీరడంతో ఇక తిరుగుబాటు బాహుట ఎగురవేశాడు ఉయ్యాలవాడ. ఈ క్రమంలో చాలా మందిని మట్టుబెట్టాడు కూడా. గొరిల్లా యుద్ధాన్ని తలపించిన రోజులవి.
అయితే 1846 ప్రాంతంలో ఆయన బ్రిటిష్ సైన్యం చేతికి చిక్కారు. భారీ సైన్యంతో ఉయ్యాల నరసింహా రెడ్డి ఉంటున్న కోట చుట్టుముట్టిన బ్రిటిష్ సైన్యం మూకుమ్మడి దాడితో..ఫిరంగి గుళ్లు కురుపించింది. ఈ ఘటనలో ప్రాణాలతో నరసింహరెడ్డిని పట్టుకుంది. వీధుల్లో ఊరేగించింది. అనంతరం కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు తెల్లదొరలు. ఇదీ….’ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి’ కధ. బ్రిటిషు దుష్టపాలనను ఎదిరించి తిరుగుబాటు బాహుట ఎగురు వేసి వీరమరణం పొందిన ఓ తెలుగు వీరుడి కధ.
ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. వెండితెర రారాజు గా వెలిగిన మెగాస్టార్ చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’గా కనిపించబోతున్నారు. తన కెరీర్ లో ఆణువణున హీరోయిజం వుట్టిపడే పాత్రలు పోషించిన చిరంజీవి.. ఇప్పుడు ఒక రియల్ హీరో పాత్రలో కనిపించడం, ఒక తెలుగు వీరుడి కధ చూపించాలని ముందుకు రావడం అభినంధనీయమే. అల్ ది బెస్ట్ మెగాస్టార్.